ETV Bharat / state

Kishan Reddy Fires on Kharge Chevella Speech : 'చేవెళ్ల సభలో ఖర్గే పచ్చి అబద్ధాలు మాట్లాడారు.. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ రెండూ ఒకటే' - Hyderabad news

Kishan Reddy Fires on Kharge Chevella Speech : చేవేళ్ల సభలో కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ఖర్గే మాట్లాడిన మాటల్లో నిజం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు రెండూ ఒకటేనని అన్నారు. ఆ రెండు పార్టీల మధ్య స్నేహం లేదని నిరూపించుకోవాలంటే తన 8 ప్రశ్నలకు ఖర్గే సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Kishan Reddy Comments  on Mallikarjun Kharge
Kishan Reddy Latest Comments
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 27, 2023, 2:05 PM IST

Kishan Reddy Fires on Kharge Chevella Speech : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సభా వేదికపై కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే పచ్చి అబద్ధాలు మాట్లాడారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి(Kishan Reddy) మండిపడ్డారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌కు మధ్య దోస్తీ లేదనే విషయాన్ని నిరూపించాలనుకుంటే తాను వేసే 8 ప్రశ్నలకు ఖర్గే సమాధానం చెప్పాలని అన్నారు. దీంతో పాటు బీజేపీకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి భూమి లేదని బుకాయిస్తున్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. కాంగ్రెస్‌కు మాత్రం హైదరాబాద్ నడిబొడ్డున 10 ఎకరాల విలువైన భూమిని ఇచ్చిందనే విషయంలో వాస్తవం ఉందని తెలిపారు. దీని వెనక ఎలాంటి ఒప్పందం లేదని ఖర్గే చెప్పగలరా అని ప్రశ్నించారు.

Kishan Reddy Fires on Mallikarjun Kharge : తెలంగాణలో చేతి గుర్తు మీద గెలిచిన చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. రాజీనామా చేయకుండానే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారని ఆరోపించారు. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల(Congress MLAs) మీద పార్టీ అధిష్ఠానం ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. ఈ విషయంలో రెండు పార్టీల మధ్య ఉన్న సత్సంబంధాలకు నిదర్శనం స్పష్టంగా తెలుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు తెలిపిందని.. దీంతో పాటు ఆ ఎన్నికల ప్రచారాన్ని రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుండి నడిపించారని ఆరోపించారు.

Mallikarjun Kharge on Woman Declaration : 'ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్​ను జనంలోకి తీసుకెళ్లండి.. మహిళా డిక్లరేషన్​ను బలంగా రూపొందించండి'

Kishan Reddy Questions to Mallikarjun Kharge : శాసన మండలిలో కాంగ్రెస్‌ను పూర్తిగా బీఆర్‌ఎస్‌లో విలీనం చేసేసినపుడు దీనిమీద స్పందించకపోవడం రెండు పార్టీల మధ్య దోస్తీకి పరాకాష్ఠ కాదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీల మధ్య మతతత్వ మజ్లిస్ సయోధ్య కుదురుతోందని విమర్శించారు. ఉమ్మడి పౌరస్మృతిని వ్యతిరేకిస్తున్నది నిజం కాదా? బీఆర్‌ఎస్‌ మద్దతు లేకుండా యూసీసీని వ్యతిరేకిస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పగలదా అని అన్నారు. లోక్‌సభ సమావేశాల్లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి బీఆర్ఎస్‌, కాంగ్రెస్ రెండూ కలిసి అనుకూలంగా ఓటు వేసిన విషయం వాస్తవం కాదని చెప్పాలన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో కేసీఆర్ కేంద్ర మంత్రిగా పని చేశారని గుర్తు చేశారు. అప్పటి నుంచే వారి స్నేహం కొనసాగుతున్నదని మండిపడ్డారు. బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్, సోనియా గాంధీ కుటుంబం ఎంతకైనా తెగిస్తారని విమర్శించారు. అవసరమైతే తమ ఓటును పూర్తిగా అవినీతి, అక్రమ, కుటుంబ రాజకీయాలు చేసే బీఆర్‌ఎస్‌కు బదిలీ చేస్తారని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభంజనాన్ని అడ్డుకోవాలనేది ఆ రెండు పార్టీల ఆలోచనని దుయ్యబట్టారు.

Kishan Reddy Fires on BRS : "పరిపాలన గాలికి వదిలేసి.. రియల్​ ఎస్టేట్ వ్యాపారంపై గురి పెట్టిన బీఆర్​ఎస్"​

Kishan Reddy Nirmal Tour : 'రైతుల భూములతో వ్యాపారం చేయడానికే నిర్మల్ మాస్టర్​ ప్లాన్​ తీసుకొచ్చారు'

Kishan Reddy Fires on BRS : బీఆర్​ఎస్​తో ఇక యుద్ధమే : కిషన్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.