ETV Bharat / state

నాకు పద్మశ్రీ వద్దు... వెనక్కిచ్చేస్తా: కిన్నెర మొగులయ్య - kinnera mogulaiah speech

కిన్నెర వాయిద్యకారుడు, పద్మశ్రీ గ్రహిత మొగులయ్య భాజపా నేతల తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ.కోటిని ప్రస్తావిస్తూ.. తన నోట్లె మన్ను కొట్టవద్దని వేడుకున్నారు.

kinnera mogulaiah fires on politicians
kinnera mogulaiah fires on politicians
author img

By

Published : May 19, 2022, 11:57 AM IST

Updated : May 19, 2022, 2:24 PM IST

నాకు పద్మశ్రీ వద్దు... వెనక్కిచ్చేస్తా

నిరుపేదనైన తనను రాజకీయ వివాదాల్లోకి లాగి నష్టం కలిగించవద్దని 12 మెట్ల కిన్నెర వాద్య కళాకారుడు దర్శనం మొగిలయ్య ఆవేదనతో వేడుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఇంటి స్థలంతో పాటు రూ. కోటి అందాయా అని ఇటీవల ఓ రాజకీయ పార్టీ నేత మొగిలయ్య వద్ద ప్రస్తావించారు.

ఇంకా అందలేదని, ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజు ఇప్పించేందుకు కృషి చేస్తున్నారని మొగిలయ్య సమాధానమిచ్చారు. ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేయడంతో మొగిలయ్య బుధవారం ఆ నాయకుడిని అచ్చంపేటలో రోడ్డుపైనే నిలదీశారు. అనంతరం విడుదల చేసిన మరో వీడియోలో మొగిలయ్య ఆవేదన వ్యక్తం చేశారు. తనకు రాష్ట్రప్రభుత్వం అండగా నిలిచిందని స్పష్టం చేశారు. ఓ పార్టీ నేతలు తనకు పద్మశ్రీ పురస్కారాన్ని కేంద్రం ఇచ్చిందంటున్నారని, అవసరమైతే దాన్ని వాపసు ఇచ్చేయడానికైనా సిద్ధమేనన్నారు. 'మీ రాజకీయాల కోసం నా నోట్లో మట్టి కొట్టవద్దని' ఆయన కోరారు.

ఇవీ చూడండి..

దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు..

దారుణం.. బాలికపై సోదరుడి అత్యాచారం..!

Last Updated : May 19, 2022, 2:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.