ETV Bharat / state

ఏపీలో ఒక్కో పేద మహిళకు 18,750 రూపాయలు

ఏపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పేద మహిళలకు వైఎస్సార్‌ చేయూత పథకం కింద ఏడాదికి రూ.18,750 చొప్పున ప్రభుత్వం ఆర్థికసాయాన్ని అందించబోతోంది. ఆంధ్రప్రదేశ్​ సచివాలయంలో గురువారం సమావేశమైన మంత్రిమండలి కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.

key-decisions-taken-by-andhra pradesh cabinate meeting
ఏపీ మంత్రిమండలి కీలక నిర్ణయం: ప్రతి పేద మహిళకు రూ. 18,750
author img

By

Published : Jun 12, 2020, 1:00 PM IST

ఆంధ్రప్రదేశ్​ సచివాలయంలో గురువారం సమావేశమైన రాష్ట్ర మంత్రిమండలి కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఏపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పేద మహిళలకు వైఎస్సార్‌ చేయూత పథకం కింద ఏడాదికి రూ.18,750 చొప్పున ప్రభుత్వం ఆర్థికసాయాన్ని అందించబోతోంది. నవరత్నాల అమల్లో భాగంగా ఈ ఏడాది ఆగస్టు 12న ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. దీని కింద వచ్చే నాలుగేళ్లలో ప్రతి లబ్ధిదారునికి సుమారు రూ.75 వేల వరకు ఆర్థిక సాయం అందనుంది. మొత్తం 24 లక్షల నుంచి 26 లక్షల మంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు.

సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని ఈ నిర్ణయాలను వెల్లడించారు. పోలవరం జలవిద్యుత్తు ఉత్పత్తి ప్రాజెక్టు పనులు మేఘా సంస్థకు అప్పగించేలా హైకోర్టు ముందు జాయింట్‌ మెమోరాండం ఆఫ్‌ అండర్‌ స్టాండింగ్‌ ఫైల్‌ చేయడానికి ఆమోదం. గతంలో రివర్స్‌ టెండర్లు పిలవగా ఈ అంశం న్యాయస్థానం పరిధిలో ఉంది. ఈ ప్రాజెక్టుకు ఐబీఎం విలువ రూ.3,216 కోట్లు కాగా 12.6 శాతం తక్కువకు టెండరు దాఖలు చేసి రూ.2,811 కోట్లకు మేఘా సంస్థ టెండర్‌ దక్కించుకుంది.

  • కర్నూలు జిల్లా పిన్నాపురంలో ఇంటిగ్రేటెడ్‌ రెన్యువల్‌ ఎనర్జీ ప్రాజెక్టు అమలుకు నిర్ణయం. 2019 ఫిబ్రవరిలో గత ప్రభుత్వం ఎకరాకు రూ.2.50 లక్షల చొప్పున తీసుకుని భూమి ఇచ్చేందుకు అంగీకారం. ఇప్పుడు అదే సంస్థ ఎకరాకు రూ.5 లక్షలు ఇచ్చేందుకు సిద్ధం. ఏటా ప్రతి మెగావాట్‌కు గ్రీన్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ ఛార్జీ కింద రూ. లక్ష చెల్లించేందుకు కంపెనీ అంగీకారం. తద్వారా ఏటా రూ.32 కోట్ల ఆదాయం. ప్రాజెక్టులో భాగంగా 580 మెగావాట్ల పవన విద్యుత్తు, 1200 మెగావాట్ల జలవిద్యుత్తు, 1000 మెగావాట్ల సౌర విద్యుత్తు ఉత్పత్తికి నిర్ణయం.
  • గర్భిణులు, తల్లులు, చిన్నారులకు మరింత పోషకాహారం అందించేందుకు 77 గిరిజన మండలాల్లో వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ కార్యక్రమం. గిరిజనేతర మండలాల్లో వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకం. ఇందుకోసం ఈ ఏడాది రూ.1,863.11 కోట్లు ఖర్చు.

  • విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం జగన్నాథపురంలో గ్రేహౌండ్స్‌ శిక్షణ కోసం 385 ఎకరాలు ఉచితంగా కేటాయింపు. అక్కడ సాగులో ఉన్న వారికి పరిహారం చెల్లించేందుకు రూ.10.85 కోట్లు ఖర్చవుతుందని అంచనా.
  • ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్య పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్‌ చట్టంలో సవరణలు చేస్తూ ఆర్డినెన్సు జారీకి ఆమోదం. ఏపీ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ కింద తెలుగు, సంస్కృత అకాడమీ సొసైటీ తిరుపతిలో ఏర్పాటుకు నిర్ణయం.
  • కాకినాడ జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో రూ.153 కోట్లతో విజయనగరం జిల్లా కురుపాంలో గిరిజన ఇంజినీరింగ్‌ కళాశాల ఏర్పాటు. ఇందులో 50 శాతం సీట్లు గిరిజనులకు, మిగిలినవి ఇతరులకు కేటాయింపు.
  • జగనన్న విద్యా దీవెన కింద ప్రతి త్రైమాసికం పూర్తి కాగానే తల్లుల ఖాతాలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు జమకు ఆమోదం.
  • గుంటూరు, శ్రీకాకుళం, మచిలీపట్నం ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాలల్లో 282 బోధన, బోధనేతర పోస్టుల మంజూరు. ఏలూరు, ఒంగోలు, తిరుపతిల్లో నర్సింగ్‌ కళాశాలలకు మరో 144 పోస్టులు.
  • ఏపీ పొరుగుసేవల కార్పొరేషన్‌లో 55 పోస్టుల భర్తీకి ఆమోదం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం, మిగిలిన వారికి 50 శాతం. పొరుగుసేవల సిబ్బంది ఖాతాలకే జీతాల జమ.

రామాయపట్నానికి రైట్‌ రైట్‌...

  • రామాయపట్నం పోర్టు నిర్మాణానికి రైట్స్‌ సంస్థ ఇచ్చిన డీపీఆర్‌కు ఆమోదం. తొలిదశలో 802 ఎకరాల్లో రూ.3,736 కోట్లతో పోర్టు నిర్మాణానికి ప్రణాళిక. 36 నెలలు గడువు. రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్లు ఇస్తుంది. రూ.2,079 కోట్ల మేర రుణాలు.
  • గండికోట జలాశయంలో 26.85 టీఎంసీలు పూర్తిస్థాయిలో నిల్వ చేసేందుకు వీలుగా నిర్వాసితులను తరలించేందుకు రూ.522.85 కోట్ల మంజూరు. వెలిగొండ ప్రాజెక్టులో పునరావాసం నిమిత్తం రూ.1,301.56 కోట్లు. తీగలేరు తూర్పు ప్రధాన కాలువ భూసేకరణకు రూ.110 కోట్ల చెల్లింపులకు ఆమోదం.
  • తిరుపతిలో సన్నిధి యాదవుల వారసత్వపు హక్కులను పరిరక్షించేందుకు అవసరమైన బిల్లు శాసనసభలో ప్రవేశపెట్టేందుకు నిర్ణయం.
  • భోగాపురం విమానాశ్రయానికి గతంలో ప్రభుత్వం కేటాయించిన 2,700 ఎకరాలను 2,200 ఎకరాలకు తగ్గింపు. ఆ విస్తీర్ణంలోనే విమానాశ్రయ నిర్మాణానికి కంపెనీ అంగీకారం. మిగిలిన 500 ఎకరాల ద్వారా రూ.1,500 కోట్లు ప్రభుత్వానికి ఆదా అయినట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు.
  • బిల్డ్‌ ఏపీలో భాగంగా గుర్తించిన 16 స్థలాలకు 11 అమ్మకానికి ఆమోదం. విశాఖపట్నంలో 7, గుంటూరులో 4 అమ్మకానికి సమ్మతి. గుంటూరులో ఒకటి, విశాఖలో మూడు చోట్ల గుర్తించిన స్థలాలను కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్‌బీసీసీ ద్వారా అభివృద్ధి చేసి, ఈ-వేలం ద్వారా విక్రయించేందుకు నిర్ణయం. గుంటూరులో ఒక స్థలం అభివృద్ధి తాత్కాలికంగా నిలుపుదల.
  • రాష్ట్రంలో రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్తు సరఫరా కోసం 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్తు ప్రాజెక్టు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటుకు ఆమోదం.
  • ఇళ్ల పట్టాలు, గృహ నిర్మాణ మార్గదర్శకాల్లో మార్పుచేర్పులకు ఆమోదం. హైకోర్టు ఆదేశాల ప్రకారం అయిదేళ్లపాటు అందులో నివాసం ఉన్న తర్వాత మాత్రమే అమ్ముకునేలా మార్పులు చేస్తూ నిర్ణయం.
  • పన్ను ఎగవేతదారులపై దృష్టి సారించేందుకు ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్సు ఏర్పాటుకు నిర్ణయం. 55 పోస్టుల మంజూరు.

ఇదీ చదవండి : 'ఆ జిల్లా మంత్రిగా ఎంతో గర్వపడుతున్నా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.