Kerala cm meet KCR: వామపక్ష కీలక నేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్ వేర్వేరుగా భేటీ అయ్యారు. సీపీఎం, సీపీఐ జాతీయ నేతలతో ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో జరుగుతున్న సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలకు హాజరయ్యేందుకు కేరళ సీఎం పినరయి విజయన్, త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తదితరులు... ఏవైఎస్ఎఫ్ జాతీయ మహాసభల కోసం సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, కేరళ మంత్రి రాజన్, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తదితరులు హైదరాబాద్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో సీపీఎం, సీపీఐ జాతీయ నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ విధానాలు, జాతీయ రాజకీయాలపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల అమ్మకం, రైతు విధానాలు, రాష్ట్రాల పట్ల అనుసరిస్తున్న వైఖరిపై చర్చించారు.
ప్రగతిశీల శక్తులు కలిసి పోరాడాలని..
కేంద్రంలో భాజపా పాలన నుంచి విముక్తి కోసం ప్రగతిశీల శక్తులు కలిసి పోరాడాలని తెరాస, ఉభయ కమ్యూనిస్టు పార్టీల నేతలు అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. భాజపా ముక్త్ భారత్ కోసం ప్రగతిశీల శక్తులు ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని సీపీఐ, సీపీఎం నేతల జాతీయ నేతలు పేర్కొన్నారు. భవిష్యత్తు కార్యాచరణ కోసం భావ సారూప్య పార్టీలు మరోసారి సమావేశం కావాలని చర్చల్లో నిర్ణయించినట్లు సమాచారం. భాజపా విభజన రాజకీయాలు దేశ ఐక్యతకే భంగం కలిగించే ప్రమాదం వుందని వామపక్ష పార్టీల నేతలు పేర్కొన్నారు. భారతీయ గంగా జమునా తహజీబ్‌ను కాపాడాల్సిన బాధ్యత రాజకీయ పక్షాలపై ఉందని వామపక్ష నేతలు అభిప్రాయపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, రైతుకూలీలకు వ్యతిరేక ధోరణితో భాజపా పాలన కొనసాగుతోందని వామపక్ష పార్టీలు పేర్కొన్నాయి.
ప్రధాని పర్యటనకు ఆటంకంపై చర్చ
పంజాబ్‌లో ప్రధాని పర్యటనకు ఆటంకంపై కేసీఆర్, వామపక్ష నేతల భేటీలో చర్చ జరిగింది. జనం లేక సభ వెలవెల పోయిందనే విషయం అర్థమై.. పరువు కాపాడుకునేందుకు భద్రత కారణాల అంశాన్ని తెరపైకి తెచ్చారని వామపక్ష నేతలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ సహా 5 రాష్ట్రాల ఎన్నికలపై కూడా తెరాస, వామపక్ష నేతలు సుదీర్ఘంగా చర్చించారు. యూపీ ఎన్నికల్లో భాజపా ఓటమి ఖాయమని.. అఖిలేష్ యాదవ్ విజయం సాధిస్తారని.. ఉభయ కమ్యూనిస్టు పార్టీల నేతలు విశ్లేషించినట్లు సమాచారం.
ఆత్మీయ ఆహ్వానానికి కృతజ్ఞతలు
తెలంగాణ ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశానని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ట్వీట్ చేశారు. కేసీఆర్ ఆత్మీయ ఆహ్వానానికి కృతక్షతలు తెలిపారు.
ఏచూరితో కలిసి సీఎం కేసీఆర్‌ను కలిశాను. కేసీఆర్ ఆత్మీయ ఆహ్వానానికి కృతజ్ఞతలు. కేసీఆర్‌తో చర్చలు ఫలప్రదంగా జరిగాయి. -పినరయి విజయన్, కేరళ సీఎం
-
Called on the Hon'ble Chief Minister of Telangana Sri K. Chandrashekar Rao with @SitaramYechury, the General Secretary of the Communist Party of India (Marxist) (@cpimspeak) and other senior party leaders. Thank you @TelanganaCMO for the warm welcome & fruitful interaction. pic.twitter.com/4PkBvmi71d
— Pinarayi Vijayan (@vijayanpinarayi) January 8, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Called on the Hon'ble Chief Minister of Telangana Sri K. Chandrashekar Rao with @SitaramYechury, the General Secretary of the Communist Party of India (Marxist) (@cpimspeak) and other senior party leaders. Thank you @TelanganaCMO for the warm welcome & fruitful interaction. pic.twitter.com/4PkBvmi71d
— Pinarayi Vijayan (@vijayanpinarayi) January 8, 2022Called on the Hon'ble Chief Minister of Telangana Sri K. Chandrashekar Rao with @SitaramYechury, the General Secretary of the Communist Party of India (Marxist) (@cpimspeak) and other senior party leaders. Thank you @TelanganaCMO for the warm welcome & fruitful interaction. pic.twitter.com/4PkBvmi71d
— Pinarayi Vijayan (@vijayanpinarayi) January 8, 2022
ఇదీ చదవండి: