తెలంగాణ వాళ్లకు పరిపాలన చేతకాదని, తెలంగాణ వస్తే గాడాంధకారం అలుముకుంటుందని తెలంగాణ రాష్ట్రంగా మనుగడ సాగించలేదని సమైక్య పాలకులు జోకులు వేశారు. కానీ నవ్విన నాపచేనే పండిందన్నట్లుగా... తెలంగాణ ప్రగతిపథంలో పరుగులు తీస్తుంటే అపహాస్యం చేసిన వాళ్లు అవాక్కవుతున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ఇది తెలంగాణా ప్రజలు, ప్రభుత్వం ఏకతాటిపై నిలిచి, పట్టుదలతో ప్రయత్నించి సాధించిన సమిష్టి విజయమని తెలిపారు.
నవ్విన నాపచేనే పండింది: కేసీఆర్
అనేక అప నమ్మకాలు, అనుమానాల నడుమ ఏర్పడ్డ రాష్ట్రం, అనతి కాలంలోనే వాటన్నింటినీ పటాపంచలు చేసింది. ఎక్కడా త్రోటుపాటు, తడబాటు లేకుండా పాలనలో పరిణతిని ప్రదర్శించింది, ఎటువంటి అవాంఛనీయ పరిణామాలు లేకుండా శాంతి, సామరస్యాలను కాపాడుకుంటూ ప్రగతి పథంలో దూసుకు పోతున్నది: కేసీఆర్