కేంద్ర జలశక్తి శాఖ అపెక్స్ కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ జలవనరులశాఖపై సమీక్షిస్తున్నారు. మంత్రులు, ఉన్నతాధికారులు, ఇంజినీర్లు హాజరయ్యారు. రాష్ట్ర వ్యూహం, వాదనలు సంబంధిత అంశాలపై సమాలోచనలు చేస్తున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి నదీజలాల వివాదాలు, అంశాలపై కేంద్రజలశక్తి శాఖ వచ్చే నెల ఐదో తేదీన అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్.. కౌన్సిల్ సమావేశంలో పాల్గొంటారు. బోర్డుల పరిధి, ప్రాజెక్టుల డీపీఆర్లు, గోదావరిలో నీటివాట, కృష్ణా బోర్డు తరలింపు అంశాలను ఎజెండాలో పొందుపరిచారు.