ముఖ్యమంత్రి కేసీఆర్ సమాఖ్య కూటమిపై మళ్లీ దృష్టి సారించారు. ఒకట్రెండు రోజుల్లో కార్యాచరణ ఖరారు చేసి రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. వివిధ పార్టీల నేతలను సంప్రదించి కూటమి ఏర్పాటుపై చర్చించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల నుంచి రాష్ట్ర రాజకీయాల్లో తీరిక లేకుండా ఉన్న కేసీఆర్ తాజాగా మళ్లీ కూటమి ప్రయత్నాలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఎన్నికలు పూర్తైన రాష్ట్రాల్లో ఆయన పర్యటించే అవకాశం ఉంది. మే 23న ఫలితాలు వెలువడనుండటం వల్ల ఈ లోపే కూటమిని క్రియాశీలంగా మార్చాలని సీఎం యోచిస్తున్నారు.
ఇదీ చూడండి: పరీక్షలు రాసిన చేతులే... పిడికిళ్లు బిగించాయి