కార్తికమాస పూజలతో రాష్ట్రంలో ఊరూవాడా పండగ వాతావరణం నెలకొంది. ఆలయాలు ప్రత్యేక పూజలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో గోదావరి నది వద్ద మహా హారతి నిర్వహించారు. గోదారమ్మకు వాయనం అందించి కన్నులపండువగా వేడుక జరిపించారు.
నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని చక్రేశ్వర శివాలయంలో లక్ష దీపారాధన నిర్వహించారు. భీంగల్‌లో శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శనివారం రథోత్సవంలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు. బాల్కొండలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అనేక మంది దంపతులు దృష్టి దోష నివారణ యాగం చేపట్టారు.
ఖమ్మం జిల్లా మధిరలో వైరా నది ఒడ్డున వెలసిన శ్రీ మృత్యుంజయ స్వామి ఆలయం ఎదుట మహిళలు లక్ష దీపాల అర్చన చేశారు. ఆదిలాబాద్‌లోని మంగమఠంలో నిర్వహించిన లక్ష తులసీదళార్చనలో అనేక మంది మహిళలు పాల్గొన్నారు. సంగారెడ్డి జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో అమ్మవారికి పల్లకి సేవ నిర్వహించి... జ్వాలాతోరణ ప్రవేశం చేశారు.
ఇదీ చూడండి: 'కేసీఆర్ సచివాలయానికి వెళ్తే... మేం ఏమిచ్చామో తెలుస్తది'