హైదరాబాద్ నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాయంలో టిప్పు సుల్తాన్ 21వ మెమోరియల్ కరాటే ఓపెన్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. విద్యార్థులు వివిధ రకాల కరాటే ఫైట్లను ప్రదర్శించారు. పోటీల్లో గెలుపొందిన వారికి గ్రాండ్ మాస్టర్ ఎమ్మెస్ జావేద్ బహుమతులు అందజేశారు. ఒలింపిక్స్లో కరాటే ప్రవేశపెడుతున్నట్లు ఇంటర్నేషనల్ రెఫరీ రవీంద్ర కుమార్ తెలిపారు. 2020 టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్లో భారత కరాటే క్రీడాకారులు సత్తాచాటుతారని ధీమా వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో జనాభా కంటే.. ఆధార్ కార్డులే ఎక్కువట.?