మగువల మనసునే కాదు కళాభిమానులను విశేషంగా అలరించే వస్త్ర ప్రపంచం కళాంజలి. తన వంతు సామాజిక బాధ్యతను చాటుకుంటోంది. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఈ ఏడాది వినాయక చవితి కోసం వినియోగదారులకు మట్టి గణపతి ప్రతిమలను అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ సైఫాబాద్‌లోని కళాంజలి భవనంలో వివిధ ఆకృతుల్లో బొజ్జ గణపయ్యలను ముస్తాబు చేసి చవితికి సిద్ధం చేసింది.
ధర తక్కువే!!
పర్యావరణ హితమైన పండుగను జరుపుకోవాలని పిలుపునిస్తూ... కళాంజలి హస్తకళల విభాగం ఈ ఏడాది 500లకు పైగా మట్టి గణపతులతో ప్రదర్శన ఏర్పాటు చేసింది. అతి తక్కువ ధరల్లో చూడచక్కటి రూపాల్లో వినాయకులను ఏర్పాటు చేయడంతో కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు.
సెప్టెంబర్ 2 వరకు:
సెప్టెంబర్ 2 వరకు కళాంజలిలో పర్యావరణ హిత గణపతుల ప్రదర్శన కొనసాగనుంది.
ఇవీ చూడండి : 'శిశు విహార్ గృహాన్ని కాపాడండి'