Kadiyam Srihari Reaction On Congress Ministers Kaleshwaram Visit : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాలు, న్యాయ విచారణ పేరుతో కొత్త నాటకాలు చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. చేయాల్సిన పనులు చేయకుండా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలియాలంటే న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు వెళ్లి వాస్తవాలు తెలిపినందుకు కాంగ్రెస్ మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. శ్వేతపత్రాలు, న్యాయ విచారణలను బీఆర్ఎస్ నాయకులు (BRS) స్వాగతిస్తున్నారని స్పష్టం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణ చేస్తాం : ఉత్తమ్‌కుమార్ రెడ్డి
కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని రాహుల్ ఆరోపించారని గుర్తు చేశారు. కానీ కాళేశ్వరానికి (Kaleshwaram Project) రూ.93వేల కోట్లు ఖర్చు చేశారని అధికారులు చెప్పారని పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి రూ.93వేల కోట్లు ఖర్చు పెడితే రూ. లక్ష కోట్లు అవినీతి ఎలా జరిగిందో కాంగ్రెస్ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు.
'కాళేశ్వరం కింద ఒక్క ఎకరాకు సాగునీరు ఇవ్వలేదని ఆరోపించారు. ఈ ప్రాజెక్ట్ కింద 98 వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చినట్లు అధికారులు చెప్పారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ ఆరోపణలు అవాస్తవమని తేలింది. తమ్మిడిహట్టి వద్ద 160 టీఎంసీలు ఉండట్లేదని కేంద్రం చెప్పింది. తమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కట్టడం వల్ల లాభం లేదని కేంద్రం చెప్పింది. గతంలో కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టులపై అనుమతులు తీసుకోలేదు. ప్రాజెక్టుల విషయమై మహారాష్ట్ర, కేంద్ర అనుమతి తీసుకోలేదు.' అని కడియం శ్రీహరి అన్నారు.
'నిర్మాణంలో చూపిన అత్యుత్సాహం నిర్వహణలో చూపించలేదు'
Congress Ministers visit To Kaleshwaram Project : గతంలో ఈపీసీ ద్వారా కాంట్రాక్టర్లు అన్ని అనుమతులు కట్టబెట్టారని, తమ్మిడిహట్టి కోసం రూ.6,116 కోట్లు ఖర్చు చేశారని మండిపడ్డారు. కానీ తమ్మిడిహట్టి ద్వారా ఒక్క ఎకరానికి కూడా సాగునీరు రాలేదని విమర్శించారు. ప్రాణహితకు నీటి లభ్యత లేనందున కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారని తెలిపారు. 248 టీఎంసీల నీటిని వినియోగించుకునేలా కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన చేశారని వివరించారు. 13 జిల్లాల్లో 19.63 లక్షల ఎకరాలకు సాగునీరు అందేలా చర్యలు తీసుకున్నామని అన్నారు.
"మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులకు అన్ని అనుమతులు తీసుకున్నాం. కేంద్ర అనుమతులు వచ్చాకే కాళేశ్వరం పనులు చేపట్టాం. తమ్మిడిహట్టి వద్ద చేపడితే రూ.38 వేల కోట్లకే పూర్తయ్యేదన్నారు. ప్రాజెక్టు వ్యయాన్ని రూ.80 వేల కోట్లకు పెంచారని ఆరోపించారు. 141 టీఎంసీలు నిల్వ చేసేలా రిజర్వాయర్ల నిర్మాణం జరిగింది.అనేక రిజర్వాయర్ల నిర్మాణం వల్ల వ్యయం పెరిగిందని గమనించాలి." - కడియం శ్రీహరి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే
మూడేళ్లలో ప్రాజెక్టుల ద్వారా 98 వేల ఎకరాలకు సాగు నీరిచ్చామని తెలిపారు. దాదాపు 16 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించామని, మేడిగడ్డ ఆనకట్ట (Medigadda Project) పియర్స్ కుంగడం దురదృష్టకరమని అన్నారు. విచారణ తర్వాత దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు.
కాళేశ్వరం 3 బ్యారేజీల్లోని నీళ్లన్నీ ఖాళీ చేయాల్సిందే! : నీటిపారుదల శాఖ