మహాత్మ జ్యోతిబా పూలే 129వ వర్థంతి వేడుకలు అంబర్ పేట్ ఆలీకేఫ్ చౌరస్తాలో ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ మాజీ రాజ్యసభ సభ్యులు వీహెచ్, అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
చదువు వద్దు... బార్లు ముద్దు అనే నినాదాన్ని కేసీఆర్ మానుకోవాలని వీహెచ్ ఎద్దేవా చేశారు. పూలే ఆశయాలను అనుసరించాల్సిన అవసరం ఈరోజు యువతలో ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయన కలలుగన్న ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు.
వంద సంవత్సరాలకు పూర్వమే సామాజిక న్యాయం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి జ్యోతిబా పూలేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి గుర్తు చేశారు. పూలే కలలుగన్న ఆశయాలు ఇప్పటికీ నెరవేరలేదని రాజ్యాంగం పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆశయాలకు కంకణబద్ధులు కావాల్సిన అవసరం ఉందని వెల్లడించారు.
ఇవీచూడండి: వైద్యురాలిని హత్య చేసి నిప్పంటించిన దుండగులు