ETV Bharat / state

సీజేఐగా తొలిసారి హైదరాబాద్​కు జస్టిస్​ ఎన్​వీ రమణ - telangana varthalu

సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా జస్టిస్​ ఎన్​వీ రమణ హైదరాబాద్​కు వచ్చారు. ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం ఘనస్వాగతం పలికింది.

nv ramana
తొలిసారిగా సీజేఐగా హైదరాబాద్​కు జస్టిస్​ ఎన్​వీ రమణ
author img

By

Published : Jun 11, 2021, 4:59 PM IST

Updated : Jun 11, 2021, 7:23 PM IST

సీజేఐగా తొలిసారి హైదరాబాద్​కు జస్టిస్​ ఎన్​వీ రమణ

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి రాష్ట్రానికి వచ్చిన జస్టిస్ ఎన్​వీ రమణకు రాష్ట్రప్రభుత్వం ఘనంగా స్వాగతం పలికింది. శంషాబాద్‌ విమానాశ్రయం చేరుకున్న ఆయనకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీతో పాటు మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని, మహమూద్ అలీ సహా మేయర్ విజయలక్ష్మీ ఘనంగా ఆహ్వానం పలికారు. అక్కడ నుంచి నేరుగా రాజ్‌భవన్‌ వెళ్లనున్న ఆయనకు గవర్నర్‌ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వాగతం పలకనున్నారు. మూడురోజుల పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్​వీ రమణ రాజ్‌భవన్‌లో బసచేయనున్నారు.

cji

అంతకుముందు ఉదయం వీఐపీ ప్రారంభ సమయంలో తిరుమల శ్రీనివాసుడిని జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులు దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు పండితులు వేద ఆశీర్వచనం అందించారు. తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు తీర్థ ప్రసాదాలతో పాటు శ్రీవారి చిత్రపటాన్ని అందించారు. ఆ తర్వాత తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ దంపతులు దర్శించుకున్నారు.

ఇదీ చదవండి: Eatala: ఈటల నివాసానికి తరుణ్ చుగ్​తో పాటు భాజపా నేతలు

Last Updated : Jun 11, 2021, 7:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.