ETV Bharat / state

pushpa pre release event case: పుష్ప ప్రీ రిలీజ్​ ఈవెంట్​ నిర్వాహకులపై కేసు నమోదు - case on mytri movie makers

pushpa pre release event case: పుష్ప చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్​ నిర్వాహకులపై జూబ్లీహిల్స్​ ఠాణాలో కేసు నమోదైంది. ఈవెంట్​ సందర్భంగా అనుమతికి మించి అభిమానులను సమీకరించడంతో పాటు.. కొవిడ్​ నిబంధన చర్యలు చేపట్టలేదంటూ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

pushpa movie pre release event
pushpa movie pre release event
author img

By

Published : Dec 13, 2021, 8:00 PM IST

Updated : Dec 13, 2021, 10:53 PM IST

pushpa pre release event case: పుష్ప చిత్రం ప్రీ రిలీజ్​ సందర్భంగా అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. హైదరాబాద్​ యూసఫ్​గూడ పోలీసు మైదానంలో ఆదివారం నిర్వహించిన ఈ వేడుకకు అనుమతికి మించి అభిమానులను సమీకరించారని పోలీసులు కేసు నమోదు చేశారు. కార్యక్రమంలో కొవిడ్​ నిబంధనలు పాటించలేదని.. రక్షణ చర్యలు చేపట్టలేదంటూ ఈవెంట్​ నిర్వాహకులైన మైత్రీ మూవీ మేకర్స్​ ప్రతినిధి కిశోర్​పై జూబ్లీహిల్స్​ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

స్తంభించిన ట్రాఫిక్​

ఆదివారం పుష్ప మూవీ ప్రీరిలీజ్​ వేడుకకు పెద్ద సంఖ్యలో అభిమానులు పోటెత్తారు. యూసఫ్​గూడ చెక్​పోస్ట్​ వద్ద భారీగా ట్రాఫిక్​ నిలిచిపోయింది. పలువురు సినీ ప్రముఖులు వేడుకకు హాజరయ్యారు. అభిమానులు, ప్రజలకు వేడుకకు రావడంతో ఆ ప్రాంతమంతా జన సంద్రంగా మారింది.

ఇవీ చూడండి: అక్కడ అందరూ 'పుష్ప' కోసం వెయిటింగ్: రాజమౌళి

అది చేసింది నేనేనా అనిపిస్తుంది: రష్మిక

Last Updated : Dec 13, 2021, 10:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.