ETV Bharat / state

ఈనెల 16న రాష్ట్రానికి జేపీ నడ్డా.. కరీంనగర్​లో భారీ సభకు ఏర్పాట్లు - BJP latest news

JP Nadda tour in Telangana: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈనెల 16న రాష్ట్రానికి రానున్నట్లు ఆ పార్టీ ముఖ్యనేతలు తెలిపారు. బండి సంజయ్​ చేస్తున్న ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా కరీంనగర్​లో జరిగే ముగింపు సభలో ఆయన పాల్గొని.. మాట్లాడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

JP Nadda
JP Nadda
author img

By

Published : Dec 5, 2022, 5:07 PM IST

JP Nadda tour in Telangana: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ నెల 16వ తేదీన రాష్ట్రానికి రానున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తలపెట్టిన ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఈనెల 16వ తేదీతో ముగియనున్నది. దీనిలో భాగంగా కరీంనగర్​లో భారీ బహిరంగ సభకు ఆ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇందులో పాల్గొంటారని ముఖ్యనేతలు పేర్కొన్నారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇటీవల కొద్దికాలంగా తమ దృష్టి దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రీకరించింది. దానికి తోడు నేటితో గుజరాత్​లో చివరిదశ ఎన్నికల పోలింగ్​ ముగియడంతో దక్షిణాది రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగురవేయలని కమలదళం వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.