రాష్ట్ర ప్రభుత్వం ఉదారంగా ముందుకు వచ్చి జర్నలిస్టులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని మల్కాజిగిరి లోక్‌సభ సభ్యుడు రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. జర్నలిస్టులు ఉపవాసదీక్ష చేస్తున్నారంటే తెరాస సర్కారు వైఫల్యం చెందినట్టేనని ఆయన వ్యాఖ్యానించారు.
జర్నలిస్టులకు 50 లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పించడంతో పాటు కరోనాతో మృతి చెందిన మనోజ్ కుటుంబాన్ని ఆదుకోవాలని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జర్నలిస్టు సంఘాలు చేపట్టిన ఉపవాసదీక్షకు ఎంపీ రేవంత్‌రెడ్డి, తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం సంఘీభావం ప్రకటించారు.
ఒక్కో కరోనా బాధితుడికి ప్రభుత్వం మూడున్నర లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నట్టు ప్రకటించింది... అసలు ఎంత ఖర్చు పెడుతున్నారో పారదర్శకంగా వెల్లడించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కరోనాతో మృతి చెందిన మనోజ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. జర్నలిస్టుల సహాయ నిధికి 2లక్షల రూపాయల చెక్కును రేవంత్‌రెడ్డి అందజేశారు.
ప్రభుత్వం ఇకనైనా మేల్కోవాలని తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం అన్నారు. కరోనా సోకిన జర్నలిస్టులందరు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. కొవిడ్-19తో మృతి చెందిన మనోజ్ కుటుంబాన్ని సర్కారు ఆదుకోవాలని కోదండరాం డిమాండ్ చేశారు.