ETV Bharat / state

విద్యుత్ ప్రైవేటుపరం కాదు.. అదంతా అబద్ధం

విద్యుత్ చట్ట సవరణ బిల్లుపై అవాస్తవాలు ప్రచారమవుతున్నాయని... వాటిలో ఏ మాత్రం లేదని ఐకాస వెల్లడించింది. దీనిపై నివేదిక అందించింది. విద్యుత్ ప్రైవేటుపరం కాదని... రైతుల నుంచి పూర్తి స్థాయి ఛార్జీలు వసూలు చేస్తారనేది పూర్తిగా అబద్ధమని తెలిపింది.

joint-action-committee-report-on-electricity-amendment-bill
విద్యుత్‌ చట్ట సవరణ బిల్లుపై తెలంగాణ ఐకాస నివేదిక
author img

By

Published : May 22, 2020, 8:54 AM IST

విద్యుత్‌ చట్ట సవరణ బిల్లులో ప్రతిపాదనలకు, బయట జరుగుతున్న ప్రచారాలకు చాలావరకు సంబంధం లేదని వాస్తవాలు మరుగున పడుతున్నాయని తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి(ఐకాస) స్పష్టం చేసింది. ఈ బిల్లుపై వాస్తవ విశ్లేషణ జరిపి విద్యుత్‌ సవరణ బిల్లు-2020, ప్రచారాలు-వాస్తవాలు-సూచనలు’’ పేరుతో నివేదికను విడుదల చేసింది.

దేశంలో అనేక విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)ల ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. అప్పుల భారాలతో, నష్టాలతో, వసూలు కాని బకాయిలతో కునారిల్లుతున్నాయి. వ్యవసాయ, గృహ విద్యుత్‌ వినియోగదారుల నుంచి వాటికి ఆదాయం పెద్దగా రాదు. అలా అని పరిశ్రమలు, పెద్ద వినియోగదారులకు ఛార్జీలను పెంచలేని పరిస్థితిలో ఉన్నాయి. ఛార్జీలను పెంచితే వీరు డిస్కంలను విడిచిపెట్టే ప్రమాదం ఉంది. ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో రాయితీల నిధులు చెల్లించనప్పుడు ఈ సంస్థలకు మళ్లీ అప్పులే మార్గం అని ఐకాస స్పష్టం చేసింది. ఈ బిల్లుపై జరుగుతున్న ప్రచారాలు, వాస్తవాలను వివరించింది.

ప్రచారం

వ్యవసాయ బోరు కనెక్షన్లకు మీటర్లు పెట్టాలి. తెలంగాణలో 24.40 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. వాటికి మీటర్లు పెట్టడం ఖర్చుతో కూడుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఒక్కో కనెక్షన్‌కు రూ.60 వేల రాయితీ చెల్లిస్తోంది. భవిష్యత్తులో ఈ సొమ్మంతా రైతు కట్టాలి.

వాస్తవం ...

ప్రతి వ్యవసాయ కనెక్షన్‌కు మీటరు పెట్టాలని ప్రతిపాదించలేదు. మీటర్లు లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం రాయితీ ఇస్తోంది. కొన్ని వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్లకు మీటర్లు బిగించి విద్యుత్‌ వినియోగ లెక్కలు వేసి రాయితీ ఇస్తోంది. బిల్లు ఆమోదం పొందితే ప్రతి ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద మీటర్లు పెట్టాలి. దానికి తగ్గ రాయితీని ప్రభుత్వం జమ చేస్తే సరిపోతుంది. రైతుల నుంచి పూర్తి ఛార్జీలు వసూలు చేస్తారనే ఆందోళన అవసరం లేదు. ప్రభుత్వం రైతుల కరెంటు ఖర్చు మొత్తం భరిస్తామనే విధాన నిర్ణయం ప్రకటించాక ఆ బాధ్యత తీసుకుంటుంది. ప్రభుత్వానికి రాయితీల భారం, ప్రజలకు ఛార్జీలు తగ్గుతాయి.

ప్రచారం

ఫ్రాంచైజీ విధానం తెస్తే డిస్కంలు ప్రైవేటు పరమవుతాయి.

వాస్తవం ...

ఫ్రాంచైజీ అంటే ఒక డిస్కం తరఫున దాని పరిధిలోని కొంత ప్రాంతంలో విద్యుత్‌ పంపిణీ చేయడానికి ఒక వ్యక్తి అదే డిస్కం నుంచి అనుమతి పొందడం అని అర్థం. ఇలా డిస్కం అనుమతి ఇవ్వాలంటే దానికి మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ముందుగా అవసరం. కాబట్టి ఫ్రాంచైజీలొస్తే డిస్కం ప్రైవేటుపరం అవుతుందనే ప్రచారానికి ఆధారం లేదు.

ఇవీ చూడండి: అక్రమంగా రైలు టికెట్ల విక్రయం.. 14 మంది అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.