జేఎన్టీయూలో పూర్వ విద్యార్థుల నెట్వర్క్ను బలోపేతం చేయాల్సిందిగా ఉపకులపతి ప్రొఫెసర్ కట్టా నరసింహా రెడ్డికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఆయన.. గవర్నర్ను రాజ్ భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. పూర్వ విద్యార్థుల సేవలు ఉపయోగించుకొని యూనివర్సిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా కొనసాగాలని గవర్నర్ పేర్కొన్నారు. యూనివర్సిటీలో పరిశోధనలు, అభివృద్ధి, ఇన్నోవేషన్ పెంపుదలకు కృషి చేయాలని సూచించారు.
ప్రపంచీకరణ నేపథ్యంలో గ్లోబల్ సవాళ్లను ఎదుర్కోవడానికి భారత్ సైన్స్, టెక్నాలజీ రంగాల్లో స్వయం సమృద్ధి సాధించడానికి అభివృద్ధి పరిశోధనలు, ఇన్నోవేషన్ అత్యంత ఆవశ్యకమని తమిళిసై పేర్కొన్నారు. అనంతరం కట్టా నరసింహా రెడ్డి తాను రచించిన నానో టెక్నాలజీ అనే పుస్తకం, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో గతంలో వైస్ ఛాన్స్లర్గా రిటైర్ అయినప్పుడు సహచరులు, శ్రేయోభిలాషులు ప్రచురించిన మరో పుస్తకాన్ని గవర్నర్కు అందజేశారు.
ఇదీ చదవండి: పండగ పేరుతో రైల్వే బాదుడు.. వలస కార్మికులపై అదనపు ఛార్జీలు