చరవాణితో తెలంగాణ విద్యుత్ పెన్షనర్లకు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించేందుకు విద్యుత్ శాఖ.. ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇకపై ఈ సర్టిఫికెట్‌ను పొందేందుకు ఎక్కడకు తిరగాల్సిన అవసరంలేదని విద్యుత్ శాఖ స్పష్టం చేసింది. ఈ యాప్‌ను వినియోగించుకోవడానికి ఆండ్రాయిడ్, యాపిల్ ఫోన్లో టీ-ఆప్ పోలియోను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆప్‌లోని మొదటి పేజీలో పింఛనర్ లైఫ్ అథంటిఫికేషన్ అనే ఐకాన్ కనిపిస్తోంది. దాని టచ్ చేస్తే పీఎల్సీ- టీఎస్ పవర్ యుటిలిటీస్‌ను క్లిక్ చేయాలి. వివరాలు నమోదు చేసుకున్న తర్వాత సబ్మిట్ క్లిక్ చేయాలి.
అనంతరం సబ్మిట్ లైఫ్ సర్టిఫికేట్ అండ్ రిసిప్ట్ అనే భాగాలు కనిపిస్తాయి. మొదట పింఛన్‌దారుని 7 నెంబర్ల ఐడీ/ పాన్ నెంబర్, ఫోన్ నెంబర్, పేరు) పూర్తి చేయాలి. తర్వాత ఫోటోను తీసుకుని సబ్మిట్ చేస్తే వివరాల దరఖాస్తు పూర్తవుతుంది. కొద్ది రోజుల్లో మనం సమర్పించిన వివరాలు ఆమోదించబడ్డాక.. ఈ సంవత్సరానికి లైఫ్ సర్టిఫికేట్ సమర్పించే పని పూర్తవుతుంది.
పెన్షనర్ కార్యాలయానికి వెళ్లకుండా ఈ యాప్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించవచ్చని విద్యుత్ శాఖ అధికారులు వెల్లడించారు. ఇటువంటి యాప్‌ను రూపొందించి వయోవృద్ధులు, పదవీవిరమణ పొందిన పింఛన్‌దారుల పట్ల ఉదారతను చాటుకున్న సీఎండీ ప్రభాకర్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండిః 14 మంది బలి- మృతుల్లో ఆరుగురు చిన్నారులు