ETV Bharat / state

మరో విశాఖ కాకుండా.... జీడీమెట్లలో అప్రమత్తమైన ప్రజలు - jeedimetla gas leak

మరో విశాఖ కాకుండా హైదరాబాద్​ జీడీమెట్ల ప్రజలు అప్రమత్తమయ్యారు. జీడీమెట్ల పరిసర ప్రాంతంలో ఉన్న పరిశ్రమల నుంచి విషవాయువులు వస్తున్నాయని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిని కఠినంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.

jeedimetla-people-worry-that-toxins-are-coming-at-hyderabad
మరో విశాఖ కాకుండా.... జీడీమెట్లలో అప్రమత్తమైన ప్రజలు
author img

By

Published : May 11, 2020, 2:49 PM IST

ఆంధ్రప్రదేశ్​ విశాఖలో విషవాయు వెలువడిన నేపథ్యంలో జీడీమెట్ల పారిశ్రామిక వాడ పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తమయ్యారు. జీడీమెట్ల పరిసర ప్రాంతంలో నిత్యం విషవాయువులు, రసాయనాలతో వెదజల్లే వాసన విపరీతంగా పరిశ్రమలు వదులుతున్నాయని... స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.

ఇవాళ జీడీమెట్ల పారిశ్రామికవాడలోని సుభాష్​నగర్​లో కుత్భుల్లాపూర్​ ఎమ్మెల్యే వివేకానంద, పీసీబీ అధికారులు నాలాల వెంట పర్యటించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిని, కాలుష్యానికి కారకులైన పరిశ్రమల పట్ల కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ ప్రాంతంలో 24 గంటలు ప్రత్యేక నిఘా ఉంచాలని అధికారులకు సూచించారు.

రాత్రి సమయాల్లో అధికంగా వాసన వస్తోందన్న సమాచారంతో ఈ ప్రాంతంలో నిత్యం నిఘాపెట్టామని పీసీబీ అధికారి ప్రవీణ్​ తెలిపారు. రాత్రి సమయాల్లో ప్రత్యేక టాస్క్​ఫోర్స్​ ఏర్పాటు చేస్తున్నట్లు పీసీబీ అధికారి వెల్లడించారు. ప్రతిరోజు ఈ ప్రాంత నీటిని సేకరించి టెస్ట్​ చేస్తామని తెలిపారు.

ఇవీ చూడండి:ప్రధానికి ముఖ్యమంత్రి ఏం చెప్పబోతున్నారు..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.