ఐఐటీల్లో ప్రవేశాల కోసం నేడు దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్‌డ్ ఆన్‌లైన్ పరీక్ష (JEE Advanced Online Exam) జరగనుంది. మొత్తం 23 ఐఐటీల్లో (IIT) సుమారు 16 వేల 500 సీట్లు ఉండగా... దాదాపు లక్ష 70వేల మంది పోటీ పడుతున్నారు. ఈ ఏడాది రెండున్నర లక్షల మంది అర్హత సాధించినా... సుమారు 80వేల మంది దరఖాస్తు చేసుకోలేదు.
రాష్ట్రం నుంచి సుమారు 14వేలు...
నేటి జేఈఈ అడ్వాన్స్‌డ్(JEE Advanced)కు రాష్ట్రం నుంచి సుమారు 14వేలు... ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 11 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణలో 15, ఏపీలో 30 పట్టణాల్లో ఆన్‌లైన్‌లో పరీక్ష జరగనుంది. ఉదయం 9 నుంచి 12 వరకు పేపర్-1... మధ్యాహ్నం రెండున్నర నుంచి ఐదున్నర వరకు పేపర్-2 పరీక్ష ఉంటుంది.
15న ఫలితాలు విడుదల...
కరోనా జాగ్రత్తలు, నిబంధనలు పాటించాలని పరీక్ష నిర్వహిస్తున్న ఐఐటీ ఖరగ్‌పూర్ (IIT Kharagpur) స్పష్టం చేసింది. మధ్యాహ్నం పరీక్ష ప్రారంభంకాగానే హాల్‌టికెట్‌ను ఇన్విజిలేటర్‌కు ఇవ్వాలి. ఈనెల 10న ప్రాథమిక సమాధానాలు, 15న ఫలితాలు విడుదల కానున్నాయి.
ఇదీ చదవండి: REVANTH REDDY: 'తెలంగాణ ఇంకెంతో కాలం కేసీఆర్ చేతిలో బందీగా ఉండదు'