విదేశాలతో వ్యాపార, వాణిజ్య సంబంధాలున్న ఐటీ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి... కర్ఫ్యూ అమలు చేసేలా జాగ్రత్తలు తీసుకున్నామని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ చెప్పారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కర్ఫ్యూ సజావుగా సాగుతోందన్నారు.
విమాన ప్రయాణికుల వల్ల కరోనా వ్యాప్తి జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే శంషాబాద్ విమానాశ్రయంలో విమానాల రాకపోకలను నిలిపివేశామన్నారు. అక్కడికి వచ్చే ప్రయాణీకులకు అక్కడే పరీక్షలు నిర్వహించి... క్వారంటైన్ కేంద్రాలకు పంపుతున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి : జనతా కర్ఫ్యూ : ఇంటికే పరిమితమైన జీహెచ్ఎంసీ మేయర్