ETV Bharat / state

అన్నయ్య తుపాకీతో కాల్చుకుందామనుకున్నా.. : పవన్ కల్యాణ్ - pawan unstoppable part 2 episode

PAWAN IN UNSTOPPABLE 2 : పవన్‌ కల్యాణ్‌ ‘అన్‌స్టాపబుల్‌ 2’ కార్యక్రమానికి హాజరైన సంగతి తెలిసిందే. గతవారం తొలి ఎపిసోడ్‌ విడుదల కాగా ఈ వారం రెండో ఎపిసోడ్‌ రిలీజ్‌ అయింది. ఈ ఎపిసోడ్​లో పవన్​ వ్యక్తిగత, రాజకీయ విశేషాలను పంచుకున్నారు. అవి మీ కోసం..

PAWAN
PAWAN
author img

By

Published : Feb 10, 2023, 7:37 AM IST

PAWAN IN UNSTOPPABLE 2 : రాత్రికి రాత్రే అద్భుతాలు జరగవని, ఏ రంగంలోనైనా నమ్మకం సంపాదించాలంటే కొన్ని దశాబ్దాల సమయం పడుతుందని ప్రముఖ హీరో, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘అన్‌స్టాపబుల్‌ సీజన్‌ 2’ కార్యక్రమానికి ఆయన హాజరైన సంగతి తెలిసిందే. గతవారం తొలి ఎపిసోడ్‌ రాగా ఈవారం రెండో ఎపిసోడ్‌ విడుదలైంది. అందులోని కొన్ని సంగతులివీ..

అలా పాలిటిక్స్‌లోకి ఎంట్రీ : ‘‘నల్గొండ జిల్లాలో ఒకప్పుడు ఫ్లోరోసిస్‌ సమస్య తీవ్రంగా ఉండేది. ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని, రక్షిత మంచి నీటిని అందించాలని ప్రయత్నం చేశా. ఆ మేరకు కొద్దిమందిని అక్కడికి పంపిస్తే స్థానిక రాజకీయ గ్రూప్స్‌ అడ్డుకున్నాయి. మంచి చేయడానికి కూడా అడ్డంకులు ఉంటాయా? అనిపించింది. ఎన్జీవో ప్రారంభించాలనుకున్నా. తర్వాత నా ఆలోచనా పరిధికి ఎన్జీవో సరిపోదనిపించింది. ఇంకా పెద్దగా ఏదో చేయాలనుకున్నా. అలా రాజకీయ పార్టీ పెట్టాం. నేను ఓ ఆలోచనతో ఉన్నా. అదే సమయంలో.. ఓసారి కలవాలంటూ నరేంద్ర మోదీ గారి నుంచి నాకు కబురు వచ్చింది. మార్చిలో పార్టీ పెట్టాం. ఎన్నికలు ఏప్రిల్‌ మధ్యలో వచ్చాయి. ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ఉండే స్టార్‌డమ్‌ పాలిటిక్స్‌లో కూడా వచ్చేస్తుందని చాలామంది అనుకుంటారు. ఎన్‌. టి. రామారావు, ఎంజీఆర్‌ గారి విషయంలో అది జరిగింది. అందరికీ అలానే అవుతుందని లేదు. ఆ స్పష్టత నాకుంది. రాం మనోహర్‌ లోహియా, లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ ప్రభావం నాపై చాలా ఎక్కువగా ఉంది. ఓ స్థాయిలో ఉండి కిందకు పడిపోయినా మళ్లీ అక్కడ నుంచి మొదలు పెట్టేందుకు నేను సిద్ధంగా ఉన్నా. నాకు పాలిటిక్స్‌ నేర్చుకోవాలనుంది’’

అన్నయ్య నుంచి నేర్చుకున్నవవే : ‘‘ఒళ్లు దాచుకోకుండా కష్టపడేతత్వాన్ని అన్నయ్య చిరంజీవి నుంచి అలవరుచుకున్నా. పాలిటిక్స్‌లో విమర్శను కచ్చితంగా స్వీకరించాలి. ఏ విమర్శనైనా భరించాలనే దాన్నీ ఆయన నుంచే నేర్చుకున్నా. సద్విమర్శ వల్ల మనలోని లోపాలేంటో తెలుసుకుని, సరిచేసుకునే అవకాశం ఉంటుంది. అన్నయ్య నుంచి తీసుకోనిది ఏదైనా ఉందంటే అది మొహమాటం. అభిమానం వేరు.. అది ఓటుగా మారడం వేరు. సినిమా రంగంలో ఎవరైనా ఎక్కువ మంది అభిమానుల్ని సంపాదించుకుని, ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే దాని వెనుక దశాబ్దాల కృషి ఉంటుంది. సినీ పరిశ్రమలో పేరున్న వ్యక్తి రాజకీయ రంగంలోకి ప్రవేశించి, అంతటి నమ్మకం పొందాలంటే సమయం పడుతుంది. రాత్రికి రాత్రే అద్భుతాలు జరగవు. తక్కువలో తక్కువ దశాబ్దన్నర తర్వాత మీరు అడిగితే నా సమాధానం వేరుగా ఉంటుంది. ప్రస్తుతానికి నేను నమ్మకాన్ని సంపాదించుకునే పరిస్థితిలోనే ఉన్నా’’

‘‘అధికారమనేది సాధ్యమైనంత ఎక్కువమందికి అండగా ఉండాలని, మనల్ని ఇబ్బంది పెట్టే ప్రభుత్వాలు ఉండకూడదని నేను కోరుకుంటున్నా. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ తమ హక్కుని సద్వినియోగం చేసుకోగలిగే సామర్థత కలిగి ఉండాలి. దాన్ని ఎవరైనా కాలరాసినా ఎదుర్కొనే శక్తి ఉండాలి. దానిలో భాగంగా నేను ముందుకెళ్తున్నా. ఆ క్రమంలో అధికారం వస్తుందో రాదో నాకు తెలియదు. నా పని నేను చేసుకుంటూ ముందుకెళ్లడమే’’ అని పవన్​ అన్నారు.

విశాఖపట్నంలో జరిగిన ఘటన గురించి స్పందిస్తూ.. ‘‘నేను ఓ అడుగు వేసినా, మాట్లాలనుకున్నా ప్రభుత్వంలో ఉండేవారందరికీ ఇబ్బందిగా ఉంటుంది. నేను మామూలుగా చూసినా దానికీ ఓ అర్థం తీస్తారు. నేను వైజాగ్‌ వెళ్లకూడదని ఎన్నో కుట్రలు పన్నారు. కానీ, నేను వాళ్లతో పోటీ పెట్టుకోలేదు. వారి ఆలోచన ఏంటో తెలియదుగాని లైట్‌ ఆపేయడంలాంటివి చేశారు. అవన్నీ సహజమేగానీ అధికార యంత్రాంగం కూడా హద్దులు దాటి అమాయికులు, ఓ మహిళపై హత్యాయత్నం కేసులు పెట్టారు. ఆధిపత్య ధోరణి అది. ఎవరూ నోరెత్తకూడదంటే ఎలా? నేను నోరెత్తుతా.. అది ప్రజలకు చేరుతుందన్న ఇబ్బంది వారికి ఉందనుకుంటా. అయితే, నేను దాన్ని రాజకీయంలో భాగంగానే చూస్తా’’

జనసేన సభకు స్థలమిచ్చారనే.. ఇళ్లు కూల్చారు: ‘జనసేన ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చారన్న కారణంగానే గుంటూరు జిల్లాలో ఇప్పటం గ్రామరైతుల ఇళ్లను ప్రభుత్వం కూల్చివేయించింది. అప్పటికే వారికి ఇచ్చిన నోటీసులను ఇదే అవకాశంగా వాడుకుంది. నేను వారిని పలకరించడానికి ఇప్పటం వెళ్దామనుకున్నా. పోలీసులు కదలనివ్వలేదు. అనుమతి లేదన్నారు. అంతకుముందు విశాఖలోనూ ఇబ్బంది పెట్టారు. కారులో ప్రజలకు కనబడకూడదు, చేతులు ఉపకూడదన్నారు. లైట్లు తీసేశారు. హోటల్‌ గదిలో నిర్బంధించారు. బయటకు రాకూడదన్నారు' అని పవన్​ వివరించారు.

‘‘ఇప్పటం గ్రామం వెళ్లేటపుడూ అలానే వ్యవహరించారు. ‘మీరు అక్కడికి వెళ్లకూడదు. వెళ్తే గొడవ చేస్తారు’ అంటూ పోలీసు అధికారులు నన్ను ఆపారు. ‘బాధితులను పరామర్శించడం నా ప్రాథమిక హక్కు’ అని చెప్పా. రోడ్డుపై నడవకూడదు, కారులోంచి బయటకు రాకూడదు, రూమ్‌లో ఉండకూడదు, రూమ్‌లోంచి బయటకు రాకూడదు.. అని అంటుంటే చాలాకాలం తర్వాత నాకు కొంచెం తిక్క వచ్చింది. అందుకే ఎవరు ఆపుతారో చూద్దాం అంటూ కారుపైకి ఎక్కి కూర్చొన్నా. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను నడుస్తా. ఎన్ని కేసులైనా పెట్టుకోండి.. నేను వెళ్తా అన్న ధోరణిలో అక్కడికి వెళ్లా. అది నిరసనలో ఓ భాగం" అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ వివరించారు. ఆహా ఓటీటీ వేదికపై ‘అన్‌స్టాప్‌బుల్‌ విత్‌ బాలకృష్ణ’ కార్యక్రమం రెండో భాగంలో పవన్‌కల్యాణ్‌ రాజకీయ, వ్యక్తిగత అంశాలను వివరించారు.

టీడీపీలో ఎందుకు చేరలేదంటే?: "నేను కాంగ్రెస్‌లోనూ చేరలేదు. అప్పటికే ఉన్న పార్టీలకు సిద్ధాంతాలు, లక్ష్యాలు ఉన్నాయి. అధికారం రాని చాలా సమూహాలకు సాధికారతనిచ్చే దిశగా వెళ్లాలంటే ఉన్న పార్టీలతో ఎంతవరకు సాధించగలనన్న సందేహం. కొన్ని మూలసిద్ధాంతాలు పెట్టుకున్నా. నాకు అధికారమున్నా, లేకున్నా ప్రజల్లో చైతన్యం వచ్చే దిశగా అడుగులు వేయాలంటే నేనే రాజకీయ పార్టీ పెట్టాలనుకున్నా" అని పవన్​ తెలిపారు.

సినిమా, రాజకీయాలు వేర్వేరు: "సినిమా అభిమానం వేరు. అది ఓటుగా మారడం వేరు. సినిమా రంగంలోని అభిమానం ఓటుగా మారాలని లేదు. రాజకీయాల్లోనూ అదేస్థాయిలో పేరు సంపాదించుకోవాలంటే అంతే కష్టపడాలి. రాజకీయాల్లో నిలబడి ఉండటం అవసరం. రాత్రికి రాత్రి అద్భుతాలు జరగవు. నేనింకా ఆ నమ్మకం సంపాదించుకునే స్థితిలోనే ఉన్నా. సినిమా రంగంలోని స్టార్‌డమ్‌ రాజకీయాల్లోకి వచ్చేస్తుందని అందరూ అనుకుంటారు. అది ఎన్టీఆర్‌, ఎంజీఆర్‌లకే వచ్చింది. పార్టీ నిర్మాణమంటే ఐడియాలజీని నిర్మించడం. ఆ భావవ్యాప్తిని పెంపొందించాలంటే రెండు దశాబ్దాలు కావాలి. సినిమా రంగంలో ఈ స్థాయిలో ఉండి రాజకీయాల్లో కింది నుంచి ప్రారంభిద్దామనుకున్నా" అని వెల్లడించారు.

* పాము తన సహజ లక్షణాన్ని కోల్పోతే దాని పడగపైనా కొడుతుంటారు. మన మంచితనం ప్రత్యర్థికి బలహీనతగా కనిపిస్తే అలాగే చేస్తారు.

* ప్రజాస్వామ్యమంటేనే నోరు ఎత్తడం. నా సినిమా వంద మందిలో 40 మందికి నచ్చకపోవచ్చు. వారు తిడతారు. భరించాలి. నచ్చని గొంతు వినాలి. అసలు నోరెత్తకూడదంటే ఎలా? నేను నోరెత్తితే ప్రజలకు చేరుతుందనే ఇబ్బందులు సృష్టిస్తున్నారు. ఇదో నిరంకుశ విధానం. రాజకీయ ప్రయాణంలో ఇదో భాగం మాత్రమే.

* ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కులను వాడుకునే శక్తి సామర్థ్యాలు ఉండాలి. ఎవరు కాలరాసినా ఎదుర్కొనే శక్తి ఉండాలి.

అదో గొప్పపుస్తకం: గుంటూరు శేషేంద్రశర్మ రచించిన ‘ఆధునిక మహాభారతం’ గొప్ప సాహిత్య విలువలతో ఉన్న పుస్తకం. నాలోని ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు అందులో ఉన్నాయి. సగటు మనిషి వేదన, ఎలా ఎదుర్కోవాలి అనే ప్రశ్నలకు జవాబులు కన్పించాయి. ఎక్కడా ఆ పుస్తకాలు దొరకలేదు. శేషేంద్రశర్మ కుమారుడు సాత్యకితో మాట్లాడి పునర్ముద్రణ చేయించాం.

మీది ముక్కుసూటి వ్యక్తిత్వం: ‘బాలకృష్ణది ముక్కుసూటి వ్యక్తిత్వం. కల్మషం లేని ఆలోచనా విధానం. మంచోచెడో మాటలు గుండెల్లోంచి వస్తాయి. ఈ ఆటకు రాకముందు ఎలాంటి భావన ఉందో కలిశాకా అదే భావన ఉంది. ఈ వేదికకు సరితూగే వ్యక్తి బాలకృష్ణ. ఆయన రాజకీయాల్లో ఉన్నత పదవులు సాధించాలని కోరుకుంటున్నా’ అని పవన్‌ అన్నారు. బాలకృష్ణ స్పందిస్తూ ‘తట్టుకోలేనంత బాధ వచ్చినప్పుడు, ఏం చేయాలో తెలియనప్పుడు తీవ్ర నిర్ణయాలు తీసుకోవాలనిపిస్తుంది. అలాంటప్పుడు స్నేహితులు, తల్లిదండ్రులు, తోబుట్టువులతో మనసువిప్పి మాట్లాడండి. సిగ్గుపడొద్దు. ఎవరేమనుకుంటారోనని భయపడకండి. దారినపోయే దానయ్య సలహా కూడా జీవితాన్ని మార్చేయొచ్చు. ఈ జన్మ ఒక వరం. జీవించడం ఒక యోగం. సాధనతో మీలో నుంచి ఒక పవర్‌స్టార్‌ పుట్టొచ్చు’ అని పేర్కొన్నారు.

అన్నయ్య తుపాకీతో కాల్చుకుందామనుకున్నా: చిన్నప్పటి నుంచి ఆస్తమా, జ్వరం ఉండేవి. ఆరు, ఏడో తరగతుల్లో ఆరోగ్యం సరిగా ఉండేది కాదు. సరైన స్నేహితుల్లేక ఇంటిపట్టునే ఉండాల్సి వచ్చేది. పుస్తకాలే స్నేహితులుగా గడిపాను. పాఠశాల, కళాశాలకు వెళ్లడం ఇబ్బందిగా అన్పించేది. పరీక్షల ఒత్తిడి నచ్చేది కాదు. ఆ క్రమంలో ఉపాధ్యాయులూ నచ్చేవాళ్లు కాదు. సెల్ఫ్‌ లెర్నింగ్‌లో నడిచాను. స్నేహితులంతా ఉన్నత చదువులు, క్రికెట్‌లో రాణిస్తున్న వేళ నేను పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయాను. ఆత్మన్యూనతాభావం ఉండేది. 17 ఏళ్ల వయసులో మానసికంగా కుంగిపోయా. చనిపోతే బాగుండు అన్పించింది. అన్నయ్య లైసెన్స్‌ రివాల్వర్‌ తీసుకుని కాల్చుకుందామనుకున్నా. సురేఖ వదిన, నాగబాబు అన్నయ్య గమనించి ఎందుకలా ఉన్నావని అడిగారు. కాల్చుకుందామనుకుంటున్నా అని చెప్పడంతో వారు చిరంజీవి అన్నయ్య దగ్గరకు తీసుకెళ్లారు. పరీక్షలపై దిగులుతో ఇలా ప్రవర్తిస్తున్నానని చెప్పారు. నువ్వేం చదవకపోయినా పర్లేదు, బతికి ఉండరా అని చెప్పారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.