ETV Bharat / state

అంధుల కోసం రూ.5తో పరికరం... వరించిన జేమ్స్​డైసన్‌- 2020 పురస్కారం

author img

By

Published : Oct 22, 2020, 9:51 PM IST

Updated : Oct 22, 2020, 10:06 PM IST

అవసరమే ఆవిష్కరణకు బీజం వేస్తుంది. ఆ ఆవిష్కరణ సమస్యకు పరిష్కారం చూపుతుంది. దేశంలో కరెన్సీ మార్పు తర్వాత అంధులు ఎదుర్కొంటున్న సమస్యలకు ఓ చిరు ఆవిష్కరణతో జవాబు చూపారు హైదరాబాద్​ నగరానికి చెందిన ఓ యువకుడు. తన ఆవిష్కరణకు అంతర్జాతీయ పురస్కారం జేమ్స్​డైసన్‌- 2020 వరించింది.

అంధుల కోసం రూ.5తో పరికరం... జేమ్స్​డైసన్‌-2020 పురస్కారం

అంధులు పాత, కొత్త కరెన్సీ నోట్లను గుర్తించేందుకు ‘దృష్టి’ పేరుతో కేవలం రూ.5 ఖర్చుతో ఓ చిన్న పరికరాన్ని హైదరాబాద్​కు చెందిన యువకుడు తయారు చేశారు. అంధులకు చేయూతనిచ్చి... ప్రఖ్యాత జేమ్స్‌ డైసన్‌- 2020 అంతర్జాతీయ పురస్కారాన్ని గెలుచుకున్నారు. నగరంలోని కూకట్‌పల్లి నివాసి లింగాల మణితేజ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ (ఎన్‌ఐడీ) అహ్మదాబాద్‌లో డిజైనింగ్‌ కోర్సు చేస్తున్నారు.

రెండేళ్ల క్రితం తన శిక్షణలో భాగంగా ‘డిజైన్‌ ఫర్‌ స్పెషల్‌ నీడ్స్‌’ అంశంలో అంధుల సమస్యల గురించి తెలుసుకున్నారు. 2016లో వచ్చిన నోట్ల రద్దు నుంచి కరెన్సీ గుర్తింపులో వీరు పడుతున్న ఇక్కట్లను తెలుసుకుని దానికి పరిష్కారంగా తన మిత్రుడు మృదుల్‌ చిముల్వార్‌తో కలిసి పరికరాన్ని తయారు చేశారు.

తక్కువ ఖర్చుతో సులువైన దారి!

కేవలం రూ. 5 ఖర్చుతో రూపొందించిన ఈ పరికరం అంధులకు బ్రెయిలీ అవసరం లేకుండా కొలతలు, స్పర్శ ద్వారా ప్రస్తుతం వాడకంలో ఉన్న 12 రకాల భారత కరెన్సీని గుర్తించొచ్చు. ఇందులో ముందుగా కరెన్సీని పాత వాటిలో, హైడినామినేషన్లు, కొత్త నోట్లను మూడుగా విభజించుకున్నారు.

నోట్లను పరికరంలో ఉంచగానే దాని కొలతను బట్టి అది ఏ నోటో తెలిసేలా గుర్తింపులిచ్చారు. 2019లో తైవాన్‌ ఇంటర్నేషనల్‌ స్టూడెంట్‌ డిజైన్‌ కాంపిటీషన్‌లో ఫైనలిస్టు, అదే ఏడాది ప్రఖ్యాత లెక్సస్‌ డిజైన్‌ అవార్డు ఇండియా ఫైనలిస్టులు. ఇప్పుడు ప్రజోపయోగ ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఏటా అందిస్తున్న జేమ్స్‌ డైసన్‌- 2020 పురస్కారాల్లో భారత జాతీయ విభాగంలో పురస్కారం అందుకుంది.

ఇండియన్‌ బ్లైండ్‌ పీపుల్‌ అసోసియేషన్‌ (బీపీఏ)తో కలిసి దృష్టికి రూపమిచ్చినట్లు యువ ఆవిష్కర్త లింగాల మణితేజ తెలిపారు. తమకు తెలిసిన డిజైనింగ్‌ విద్య ద్వారా సమస్యలకు పరిష్కారం చూపించాలనుకున్నట్లు పేర్కొన్నారు. అందుకే చేసి చూపించినట్లు తెలిపారు. ఈ పురస్కారం ఇచ్చిన ప్రోత్సాహంతో మరిన్ని ఆవిష్కరణలు చేస్తామని వివరించారు.

అంధుల కోసం రూ.5తో పరికరం... వరించిన జేమ్స్​డైసన్‌- 2020 పురస్కారం

ఇదీ చూడండి: దీక్షిత్ కథ విషాదాంతం... గుండెలవిసేలా రోదించిన పేగుబంధం

Last Updated : Oct 22, 2020, 10:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.