హైదరాబాద్ ఖైరతాబాద్‌లో జల మండలి ఎదుట ఒప్పంద, పొరుగు సేవల కార్మికులు ఆందోళనకు దిగారు. తెరాస కార్మిక విభాగం, ఒప్పంద, పొరుగు సేవల కార్మికుల సంఘం, కృష్ణా నీటి సరఫరా కార్మికుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో జల మండలి కార్యాలయాన్ని ముట్టడించారు. ఒప్పంద, పొరుగుల సేవల కార్మికులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ... కార్మికులు కార్యాలయం ఎదుట బైఠాయించారు. విద్యుత్ సంస్థ తరహాలో వేతనాలు పెంచాలని... అరకొర వేతనాలతో పనిచేస్తున్న ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని విజ్ఞప్తి చేశారు. జల మండలి పరిధిలో ఐదారు పథకాల్లో సుధీర్ఘకాలంగా పనిచేస్తున్న పొరుగు సేవలు, ఒప్పంద కార్మికుల సంక్షేమం విస్మరించిన సర్కారు వైఖరికి నిరసనగా తాము ఆందోళనకు దిగినట్లు కార్మిక సంఘాలు తెలిపాయి. పదిహేను రోజుల్లో తమ సమస్యలు పరిష్కరించకపోతే విధులు బహిష్కరించి నీటి సరఫరా బంద్ చేస్తామని హెచ్చరించారు.
ఇవీ చూడండి: 'వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు పోయినట్లుంది'