లాక్డౌన్ నేపథ్యంలో గడిచిన రెండు నెలల నుంచి వాణిజ్య భవనాలు, హోటళ్లు, షాపింగ్ మాల్స్, ఇతర కార్యాలయాలు మూసి ఉన్నాయి. లాక్డౌన్ 4.0లో వాటిని తెరిచేందుకు అధికారులు అనుమతులిచ్చారు. భవనాల్లోని నీటి నిల్వలు... ఇప్పుడు ఉపయోగించవద్దని జలమండలి ఎండీ దానకిషోర్ సూచించారు.
భవనాల్లోని సంపులు, ట్యాంకుల్లో నిల్వ ఉండిపోయిన నీటిని తొలిగించాలని.. వాటిని పూర్తిగా శుభ్రపరచుకున్నాకే వాడాలని ఆయన కోరారు. తాజా నీటితో సంపులు, ట్యాంకులు నింపుకుంటే ఈ కాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు దరిచేరవని దానకిషోర్ వివరించారు.
ఇవీ చూడండి: తొలిగిన అవరోధాలు.. ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు