హైదరాబాద్‌లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి సంస్మరణ సభ నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు రాజకీయ ప్రముఖులు జైపాల్‌రెడ్డితో గల అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. జైపాల్ రెడ్డి , తాను ఒకే జిల్లా నుంచి వచ్చిన శాశ్వత స్నేహితులమని సీపీఐ జాతీయ నేత సురవరం అన్నారు. "లైఫ్ లాంగ్ ఫ్రెండ్... పర్మినెంట్ పొలిటికల్ అపోనెంట్" అని జైపాల్ రెడ్డి అన్న మాటను గుర్తు చేసుకున్నారు. దేశరాజకీయాలపై తనదైన ముద్రవేసిన జైపాల్ రెడ్డి మృతి తనను తీవ్రంగా కలిచివేసిందని సుధాకర్ రెడ్డి తెలిపారు. జైపాల్ రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
ప్రజా సమస్యలపై పార్లమెంటులో గళం విప్పిన మహబూబ్‌నగర్ ముద్దుబిడ్డి జైపాల్ రెడ్డి అని తెతెదేపా నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన వ్యక్తి అని గుర్తుచేసుకున్నారు. జైపాల్‌రెడ్డి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
ఇదీ చూడండి: జైపాల్ రెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించిన చంద్రబాబు