కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి సంస్మరణ సభ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లోని ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో జరిగిన సంస్మరణ సభకు కేంద్ర మాజీమంత్రి శ్రీకాంత్ జేనా, మాజీ హోం మంత్రులు వసంత నాగేశ్వరరావు, జానారెడ్డి, నాయిని నర్సింహారెడ్డితో పాటు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు. జైపాల్ రెడ్డి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కేంద్ర మాజీ మంత్రిగా, ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఉన్నత శిఖరాలకు ఎదిగిన స్వర్గీయ జైపాల్ రెడ్డి ఆశయాలను, భావాలను పాటిస్తూ ముందుకు సాగాలని సమావేశంలో వక్తలు కోరారు.
ఇవీ చూడండి: షాద్‌నగర్ ఘటన కేసులో నలుగురి అరెస్టు, పరారీలో ఒకరు