ETV Bharat / state

Jai Mahabharat Party Women MLA Tickets : '119 స్థానాల్లో మహిళలే పోటీ.. ఆడవాళ్ల చేతిలో కేసీఆర్ పతనం ఖాయం'

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 30, 2023, 11:02 AM IST

Jai Mahabharat Party Women MLA Tickets Telangana 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాల్లో మహిళా అభ్యర్థులనే రంగంలోకి దించనున్నట్లు జై మహా భారత్ పార్టీ జాతీయ అధ్యక్షుడు భగవాన్ అనంతవిష్ణు ప్రభు ప్రకటించారు. సీఎం కేసీఆర్, మంత్రులపై.. బలమైన మహిళా అభ్యర్థులను నిలబెట్టి వారిని ఓడిస్తామని తెలిపారు

Jai Maha Bharat Party
Jai Maha Bharat Party
Jai Maha Bharat Party Women MLA Tickets మహిళలకే అన్ని సీట్లు ప్రకటించిన జై మహా భారత్ పార్టీ

Jai Mahabharat Party Women MLA Tickets Telangana 2023 : తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. ఇప్పటికే పార్టీలు కదనరంగంలోకి దూకాయి. అధికార బీఆర్ఎస్ మొదటగా తన అభ్యర్థులను ప్రకటించి.. ప్రత్యర్థి పార్టీలకు సవాల్ విసిరింది. కాంగ్రెస్‌ కూడా 100 ఎమ్మెల్యే స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ ఇప్పటి వరకూ 53 మందిని ప్రకటించగా.. మిగతా అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తు చేస్తోంది.

Telangana Assembly Polls 2023 : ఓవైపు టికెట్‌ దక్కించుకున్న నేతలు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తూ.. గెలుపు వ్యూహాలకు పదును పెడుతున్నారు. మరోవైపు ఇంటింటి ప్రచారాలు, రోడ్‌ షోలతో.. ప్రధాన పార్టీలు ప్రజలను ఆకట్టుకునే పనిలో పడ్డాయి. కార్యకర్తల నుంచి పార్టీ అధినేతల వరకు ఆచితూచి అడుగులేస్తున్నారు. ఇలా ప్రధాన పార్టీలన్నీ తమ ప్రచారంలో దూసుకెళ్తుండగా వైఎస్సార్టీపి.. జనసేన వంటి పార్టీలు కూడా ఈ ఎన్నికల్లో పోటీకి రెడీ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే మరో పార్టీ 119 స్థానాల్లో తమ అభ్యర్థులను ప్రకటిస్తామంటూ ఓ వినూత్న ప్రకటన చేసి అందర్నీ ఆకట్టుకుంది.

Telangana Assembly Election Polling Arrangements : ఎన్నికలకు చురుగ్గా ఏర్పాట్లు.. ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునేలా పోలీసుల చర్యలు

Jai Mahabharat Party MLA Candidates List Telangana 2023 : : తెలంగాణల అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాలను మహిళలకే కేటాయిస్తున్నట్లు జై మహా భారత్ పార్టీ (Jai Maha Bharat Party) ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్‌ సైఫాబాద్‌లోని కార్యాలయంలో .. పార్టీ జాతీయ అధ్యక్షుడు భగవాన్‌ అనంతవిష్ణు ప్రభు (Bhagwan Anantavishnu Prabhu) ఈ విషయాన్ని తెలిపారు. ఈ సందర్భంగా 11 స్థానాలకు అభ్యర్థులను ఆయన ప్రకటించారు. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ (KCR), మంత్రులపై బలమైన మహిళా అభ్యర్థులను నిలబెట్టి వారిని ఓడిస్తామని అనంతవిష్ణు ప్రభు చెప్పారు.

తమ పార్టీ అధికారంలోకి రాగానే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని భగవాన్ అనంతవిష్ణు ప్రభు హామీ ఇచ్చారు. 119 స్థానాల్లో మహిళా అభ్యర్థులను బరిలోకి దించనునట్లు పేర్కొన్నారు. నవంబర్ 1న నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో 50,000 మందితో మహిళా గర్జన నిర్వహిచనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉచిత విద్య, వైద్యం అందిస్తామని.. భూలక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు 200 గజాల స్థలాన్ని ఉచితంగా పంపిణీ చేస్తామని అనంతవిష్ణు ప్రభు వెల్లడించారు.

BRS Election Campaign in Full Josh : ఇంటింటి ప్రచారంతో నేతలు.. గెలుపు వేటలో గులాబీ పరుగులు

గృహలక్ష్మి పథకం కింద ప్రతి కుటుంబానికి రూ.32,000 విలువ చేసే సోలార్ స్టవ్ ఉచితంగా ఇస్తామని అనంతవిష్ణు ప్రభు పేర్కొన్నారు. ఎల్పీజీ గ్యాస్‌ను నిషేధించి.. ప్రతి ఇంటికి రూ.50కే బయో గ్యాస్‌ (గోబర్ గ్యాస్) సిలిండర్, వంటింటికి సరిపడా నిత్యావసర వస్తువులను తక్కువ ధరకే అందించి ప్రజల కష్టాలను తీరుస్తామని హామీ ఇచ్చారు. ప్రపంచంలో ఏ పార్టీ 100 శాతం సీట్లు మహిళలకు టికెట్లు కేటాయించలేదని.. జై మహా భారత్ పార్టీ ఆడవారికి పెద్ద పీట వేస్తుందని అనంతవిష్ణు ప్రభు స్పష్టం చేశారు.

"ప్రపంచంలో ఏ పార్టీ 100 శాతం సీట్లు మహిళలకు టికెట్లు కేటాయించలేదు. జై మహా భారత్ పార్టీ ఆడవారికి పెద్ద పీట వేస్తుంది. తమ పార్టీ అధికారంలోకి రాగానే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాం. రాష్ట్రవ్యాప్తంగా ఉచిత విద్య, వైద్యం అందిస్తాం. భూలక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు 200 గజాల స్థలాన్ని ఉచితంగా పంపిణీ చేస్తాం." - భగవాన్ అనంతవిష్ణు ప్రభు, జై మహాభారత్ పార్టీ జాతీయ అధ్యక్షుడు

Mahbubnagar District Latest Politics 2023 : పాలమూరు జిల్లాలో జోరుగా జంపింగ్​లు.. ఇతర పార్టీల్లో చేరేందుకు అసంతృప్తుల సన్నాహాలు

Congress MLA Ticket Issues in Telangana : కాంగ్రెస్‌లో అసమ్మతి జ్వాల.. అసంతృప్తులను బుజ్జగించేందుకు రంగంలోకి ముఖ్యనేతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.