Jaggareddy criticized BJP TRS parties: రాష్ట్రంలో కాంగ్రెస్ లేకుండా చేయాలనే.. టీఆర్ఎస్, బీజేపీ నేతలు కుట్రలు చేస్తున్నారని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. బీజేపీ, టీఆర్ఎస్లు ప్రజా సమస్యలపై మాట్లాడకుండా ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయని ఆయన విమర్శించారు. ప్రజా సమస్యలను కాంగ్రెస్ కూడా పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎంపీ ధర్మపురి అరవింద్ పంచాయితీ ఏంటి? కాలక్షేపం కాదా? అని ప్రశ్నించారు.
ఆ ఇద్దరేమన్నా రైతులు, విద్యార్థులు, ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలపై కొట్లాడుతున్నారా? అని ధ్వజమెత్తారు. ప్రజలు విపక్ష హోదా ఇచ్చిన దృష్ట్యా ప్రజా సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పోరాటాలు చేయాలి.. ప్రజలకు వద్దకు పార్టీ వెళ్లాలని సూచించారు. వారానికోసారి పీసీసీ సమావేశం అన్నారు.. కానీ ఆ ఊసే లేదని జగ్గారెడ్డి తప్పుపట్టారు. పీసీసీలో నేతలను సమన్వయం చేయాల్సిన మహేష్ గౌడ్ విఫలమయ్యారని మండిపడ్డారు.
జూం సమావేశానికి మహేష్ గౌడ్ తనను ఆహ్వానిస్తే ఆగ్రహం వ్యక్తం చేశానని, కరోనా తగ్గిపోయినా ఇంకా జూం మీటింగ్ ఏంటి..? అని సూటిగా ప్రశ్నించారు. ఏమైనా పార్టీకి నష్టం జరిగితే మహేష్ గౌడ్‌దే పూర్తి బాధ్యత అని తేల్చి చెప్పారు. ఈ విషయంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తప్పు కూడా ఉందని.. అతనిదీ 100 శాతం తప్పేనని తప్పుపట్టారు. ఇంట్లో కూర్చుని జూం మీటింగ్ వృథా.. కూర్చుని గంటల తరబడి చర్చించే ఎన్నో అంశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఆయా అంశాలపై క్షుణ్ణంగా ఏఐసీసీ, అధిష్ఠానానికి లేఖ రాస్తున్నట్లు జగ్గారెడ్డి ప్రకటించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ లేకుండా చేయాలనే.. తెరాస, భాజపా నేతలు కుట్రలు చేస్తున్నారు. . ప్రజా సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పోరాటాలు చేయాలి. వారానికోసారి పీసీసీ భేటీ పెట్టాలి. ఇదే పరిస్థితి కొనసాగితే కాంగ్రెస్‌కు తీవ్ర నష్టం జరుగుతుంది. పీసీసీలో నేతలను సమన్వయం చేయడంలో మహేశ్‌గౌడ్ విఫలమయ్యారు. - జగ్గారెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే
ఇవీ చదవండి: