ETV Bharat / state

'ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులపై షెడ్యూల్ విడుదల చేయాలి' - తెలంగాణ వార్తలు

ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులపై షెడ్యూల్ విడుదల చేయాలని జాక్టో డిమాండ్ చేసింది. వేసవి సెలవులు పూర్తి కావొస్తున్నా షెడ్యూల్ విడుదల చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బషీర్​బాగ్​లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ మంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు.

jacto letter to minister, minister sabita indra reddy
జాక్టో, సబితా ఇంద్రారెడ్డి
author img

By

Published : Jun 7, 2021, 2:15 PM IST

ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్​ను వెంటనే విడుదల చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఉపాధ్యాయ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి, ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ వినతి పత్రం అందజేశాయి. బదిలీలు, పదోన్నతులు పాత జిల్లాల ప్రాతిపదికన, యాజమాన్యం వారీగా నిర్వహిస్తామని మార్చి 22న అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన అమలు చేయాలని కోరింది. బషీర్​బాగ్​లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జాక్టో, యుఎస్పీసీ స్టీరింగ్ కమిటీ నాయకులు మంత్రిని కలిశారు. వేసవి సెలవులు పూర్తి కావొస్తున్నా షెడ్యూల్ విడుదల చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

పలువురు అధికారులు కొవిడ్ బారిన పడడం వల్ల షెడ్యూల్ విడుదలలో జాప్యం జరిగిందని మంత్రి అన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుల పోస్టుల మంజూరు కోసం ఫైల్ సర్క్యులేషన్​లో ఉందని... ఆమోదం రాగానే షెడ్యూల్ విడుదల చేస్తామని తెలిపారు. పాత జిల్లాలు, యాజమాన్యాల వారీగానే నిర్వహించనున్నామని స్పష్టం చేశారు. ఆదర్శ పాఠశాలల్లోనూ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు నిర్వహిస్తామన్నారు. అంతర్​ జిల్లా బదిలీల ఫైల్ సాధారణ పరిపాలనా శాఖ పరిశీలనకు పంపామని... రాగానే ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపి ఆమోదించిన తర్వాత షెడ్యూల్ విడుదల చేస్తామన్నారు.

జీరో సర్వీసుతో అంతర్​జిల్లా బదిలీలకు అవకాశం ఇవ్వాలని కోరగా… పరిశీలిస్తామన్నారు. వ్యాక్సినేషన్​లో ఉపాధ్యాయులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరగా... రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మాట్లాడుతామని తెలిపారు. ఆన్​లైన్​ తరగతుల నిర్వహణపై ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారని జాక్టో ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జి.సదానంద గౌడ్, కె.జంగయ్య, యు.పోచయ్య, చావ రవి, బి కొండయ్య, కె.అశోక్ కుమార్, జి.రామకృష్ణ తదితరులు మంత్రిని కలిశారు.

ఇదీ చదవండి: గంటల కొద్దీ కదలకుండా కూర్చుంటే ఆరోగ్యానికి చేటే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.