ETV Bharat / state

హైదరాబాద్‌లోని పలుచోట్ల ఐటీ సోదాలు - నగరంలో మరోసారి ఐటీ దాడుల కలకలం

IT searches
IT searches
author img

By

Published : Jan 12, 2023, 2:34 PM IST

Updated : Jan 12, 2023, 3:11 PM IST

14:31 January 12

హైదరాబాద్‌లోని పలుచోట్ల ఐటీ అధికారుల సోదాలు

IT Raids in Hyderabad Today: తెలుగు రాష్ట్రాల్లో ఐటీ సోదాలు అలజడి రేపుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో ఐటీ శాఖ సోదాలు ముమ్మరంగా సాగుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు అనే తేడా లేకుండా దాడులు జరుగుతున్నాయి. తాజాగా హైదరాబాద్​లోని పలుచోట్ల ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. బాలనగర్​లోని రసాయన పరిశ్రమలు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. దిల్లీ నుంచి వచ్చిన ఐటీ అధికారుల ఆధ్వర్యంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి.

వారం రోజుల కిందట హైదరాబాద్‌లో పలుచోట్ల ఆదాయపన్నుశాఖ సోదాలు కలకలంరేపాయి. 20 బృందాలుగా ఏర్పడిన 60మంది ఐటీ అధికారులు.. ఏకకాలంలో వివిధ చోట్ల దాడులు నిర్వహించారు. హైదరాబాద్‌లోని ఎక్సెల్‌ గ్రూప్‌తో పాటు అనుబంధ సంస్థల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. గచ్చిబౌలి మైండ్ స్పేస్ సమీపంలోని ఎక్సెల్‌ రబ్బర్‌ లిమిటెడ్‌ సంస్థలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇన్‌ఫ్రా, ఐటీ గ్రూప్ ఆఫ్ ఇంజినీరింగ్, హెల్త్ కేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌ను ఎక్సెల్‌ గ్రూప్‌ నడుపుతోంది. అలాగే... బాచుపల్లి, చందానగర్‌, కోకాపేట, బాబుఖాన్ లేక్ ఫ్రంట్ విల్లాస్‌లోని అనుబంధ సంస్థల్లోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ సంస్థ ఆదాయ పన్ను చెల్లింపుల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆదాయ పన్ను అధికారులు సోదాలు జరపటం చర్చనీయంగా మారింది.

డిసెంబర్​లో స్థిరాస్థి వ్యాపారి వంశీరామ్‌ బిల్డర్స్‌పై రెండు రోజులుగా కొనసాగిన ఐటీ సోదాల్లో పెద్ద ఎత్తున దస్త్రాలు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌, విజయవాడల్లోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్‌లో 15, విజయవాడలో మరో పది లెక్కన 25 ఐటీ బృందాలు సోదాలు నిర్వహించాయి. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ప్రధాన కార్యాలయంతో పాటు మరికొన్ని చోట్ల సోదాలు చేశారు. డాక్యుమెంట్లు, హార్డ్‌ డిస్క్‌లు, పెన్‌ డ్రైవ్‌లు, కంప్యూటర్లు, సీపీయులు స్వాధీనం చేసుకున్న ఐటీ బృందాలు వాటిని ఐటీ కార్యాలయానికి తరలించాయి. బ్యాంకుల్లో లాకర్లు ఉన్నట్లు గుర్తించి కొన్ని లాకర్లను తెరచి మరికొన్నింటి స్వాధీనం చేసుకున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Jan 12, 2023, 3:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.