భూముల క్రమబద్ధీకరణ చేస్తేనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపడతామని ప్రభుత్వం చెప్పడాన్ని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఖండించారు. ఎల్ఆర్ఎస్ లేని లేఅవుట్లలో ప్లాట్ కొన్న వాళ్ల నుంచి డబ్బులు తీసుకోకుండా రెగ్యులరైజ్ చేయాలని సూచించారు.
'జీఓ 131ను రద్దు చేయాలి'
జీఓ 131ని రద్దు చేసి ప్లాట్‌లు ఉచితంగా రెగ్యులరైజ్ చేయాలని కోరారు. కరువు కాలంలో పేద ప్రజలను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యతగా జగ్గారెడ్డి గుర్తుచేశారు. నగదు రద్దు, జీఎస్‌టీతో పాటు ఇటీవలే కరోనాతో జనం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని గుర్తుచేశారు. ఎల్‌ఆర్‌ఎస్‌పై తాను అసెంబ్లీలో ప్రస్తావించనున్నట్లు పేర్కొన్నారు.
ఇవీ చూడండి : కొత్త రెవెన్యూ చట్టాన్ని పకడ్బందీగా అమలుచేయాలి : కేసీఆర్