ETV Bharat / state

'కలర్స్​'పై ఐటీ దాడులు... - latest news of it attacks on kolours

కలర్స్​ హెల్త్​కేర్​ సంస్థలపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఉన్న పలు కార్యాలయాల్లో దాడులు జరిపారు. భారీగా పన్ను ఎగవేశారని కలర్స్​పై కేసు నమోదు చేశారు.

కలర్స్​లో ఐటీ దాడులు
author img

By

Published : Oct 30, 2019, 4:55 PM IST

Updated : Oct 30, 2019, 8:17 PM IST

కలర్స్‌ హెల్త్‌కేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలపై ఐటీ అధికారులు దాడులు జరిపారు. నాలుగు రాష్ట్రాల్లో కలర్స్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాల్లో ఆదాయపు పన్ను అధికారులు సోదాలు నిర్వహిసున్నారు. కలర్స్ సంస్థపై కేసు నమోదు చేసిన హైదరాబాద్ రీజియన్ ఐటీ ఇన్వెస్టిగేషన్ విభాగం ఇవాళ ఏకకాలంలో తెలుగు రాష్ట్రాలలోని పలు కార్యాలయాల్లో సోదాలు జరిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 50కి పైగా కార్యాలయాలల్లో తనిఖీలు జరుగుతున్నట్టు ఐటీ అధికారులు తెలిపారు. ప్రధానంగా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, బెంగుళూరులతోపాటు ఈ సంస్థ కార్యాలయాలు ఉన్న అన్ని ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఆ సంస్థ చెల్లిస్తున్న ఆదాయపు పన్నుకి, ఆ సంస్థకి వస్తున్న ఆదాయానికి తేడా ఉందని అధికారులు గుర్తించారు. ప్రాధమికంగా సమాచారం సేకరించిన తర్వాత కేసు నమోదు చేసినట్లు ఐటీ అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: కేంద్ర రక్షణ మంత్రితో కేటీఆర్​ భేటీ

Last Updated : Oct 30, 2019, 8:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.