ETV Bharat / state

గూగుల్‌ పేలో చెల్లింపు.. వాట్సాప్‌లో బోగస్‌ ప్రతులు..! - Telangana Excise Department

తెలంగాణ ఎక్సైజ్‌శాఖలో ఈవెంట్‌ నకిలీ పర్మిట్ల బాగోతం తాజాగా బయటపడింది. ఆ శాఖ శేరిలింగంపల్లి ఎస్‌హెచ్‌వో ఇచ్చిన ఫిర్యాదుతో ఇలాంటి ఆశ్చర్యకర అంశాలు వెలుగుచూస్తున్నాయి. గూగుల్‌పే లేదా ఫోన్‌పే ద్వారా నిర్వాహకుల నుంచి డబ్బులు తెప్పించుకోవడం.. ఆ మొత్తాన్ని ఖజానాకు జమ చేయకుండా జేబులో వేసుకోవడం.. కంప్యూటర్‌లో పాత చలానాను డౌన్‌లోడ్‌ చేయడం.. చేతిరాతతో ఈవెంట్‌ నకిలీ పర్మిట్‌ జారీ చేయడం.. ఆ ప్రతినివాట్సాప్‌లో నిర్వాహకులకు పంపించి.. వచ్చిన కాడికి దండుకోవడం.. ఇలా ఏళ్ల తరబడి సాగిన ఈ దందా గత నెలలో బహిర్గతమైంది.

గూగుల్‌ పేలో చెల్లింపు.. వాట్సప్‌లో బోగస్‌ ప్రతులు..!

author img

By

Published : Jun 6, 2022, 8:37 AM IST

గూగుల్‌పే లేదా ఫోన్‌పే ద్వారా నిర్వాహకుల నుంచి డబ్బులు తెప్పించుకోవడం.. ఆ మొత్తాన్ని ఖజానాకు జమ చేయకుండా జేబులో వేసుకోవడం.. కంప్యూటర్‌లో పాత చలానాను డౌన్‌లోడ్‌ చేయడం.. చేతిరాతతో ఈవెంట్‌ నకిలీ పర్మిట్‌ జారీ చేయడం.. ఆ ప్రతిని వాట్సాప్‌లో నిర్వాహకులకు పంపించడం.. తెలంగాణ ఎక్సైజ్‌శాఖలో ఈవెంట్‌ నకిలీ పర్మిట్ల బాగోతం ఇలా సాగింది. ఎక్సైజ్‌శాఖ శేరిలింగంపల్లి ఎస్‌హెచ్‌వో ఇచ్చిన ఫిర్యాదుతో ఆ శాఖ జూనియర్‌ అసిస్టెంట్లు వివేక్‌, సాయిబాబు, సలాలుద్దీన్‌పై ఆర్జీఐఏ పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేసి ప్రాథమికంగా దర్యాప్తు ఆరంభించడంతో ఇలాంటి ఆశ్చర్యకర అంశాలు వెలుగుచూస్తున్నాయి. సాధారణంగా కన్వెన్షన్‌ సెంటర్లు, ఫంక్షన్‌హాళ్లు, బాంకెట్‌హాల్స్‌లాంటి ఎస్టాబ్లిష్‌మెంట్లలో జరిగే వేడుకల్లో మద్యం సరఫరా గనక చేస్తే ఎక్సైజ్‌శాఖ నుంచి ఈవెంట్‌ పర్మిట్‌ అనుమతి పొందాలి. ఇందుకోసం ఎక్సైజ్‌శాఖకు రూ.12వేలను చలానా రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఏళ్ల తరబడి ఎక్సైజ్‌శాఖ కార్యాలయాల్లో పాతుకుపోయిన క్షేత్రస్థాయి సిబ్బంది ఈ వ్యవహారంలో చేతివాటం ప్రదర్శించడం ఆరంభించారు. ఎస్టాబ్లిష్‌మెంట్ల నిర్వాహకుల నుంచి డబ్బులు దండుకొని నకిలీ పర్మిట్లను జారీ చేయడం మొదలుపెట్టారు. ఏళ్ల తరబడి సాగిన ఈ దందా గత నెలలో బహిర్గతమైంది. శంషాబాద్‌ డీపీఈవో కార్యాలయం పరిధిలోని జూనియర్‌ అసిస్టెంట్లు ఇలాగే జారీ చేసిన ఓ నకిలీ పర్మిట్‌ గురించి ఫిర్యాదు రావడంతో ఎక్సైజ్‌శాఖ అధికారులు అంతర్గతంగా విచారణ జరిపారు. ముగ్గురు జూనియర్‌ అసిస్టెంట్ల పాత్ర బహిర్గతం కావడంతో భారీగా అక్రమాలు జరిగి ఉంటాయనే అనుమానంతో పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు కూపీ లాగుతుండటంతో విస్తుపోయే విషయాలు వెలుగుచూస్తున్నాయి.

ఎస్టాబ్లిష్‌మెంట్‌ నిర్వాహకులపై ఒత్తిళ్లు..
ఈవెంట్‌ నకిలీ పర్మిట్ల బాగోతంలో ఎస్టాబ్లిష్‌మెంట్‌ నిర్వాహకుల వాంగ్మూలాలు పోలీసుల దర్యాప్తులో కీలకం కానున్నాయి. వారి వద్ద ఉన్న ప్రతులను గనక సేకరిస్తే నకిలీ పర్మిట్ల గుట్టు రట్టవుతుందని భావిస్తున్నారు. అయితే ఈ విషయం ముందే పసిగట్టిన అక్రమార్కులు ఇప్పటికే పలు ఎస్టాబ్లిష్‌మెంట్‌ నిర్వాహకులను కలిసినట్లు.. వారి వద్ద ఉన్న నకిలీ పర్మిట్ల ప్రతులను రికార్డుల నుంచి తొలగించే పన్నాగాలకు తెర లేపినట్లు ఎక్సైజ్‌శాఖలో ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఎక్సైజ్‌శాఖలో కొందరు ‘పెద్దలు’ అక్రమార్కులకు వత్తాసు పలుకుతూ పోలీసుల దర్యాప్తును ప్రభావితం చేసే పనిలో నిమగ్నమయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పోలీస్‌ దర్యాప్తు ఆధారంగా ముందుకు..
నకిలీ పర్మిట్ల బాగోతం సరూర్‌నగర్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి డీపీఈవోలతోపాటు పలు జిల్లాకేంద్రాల్లోనూ చోటు చేసుకుని ఉంటుందనే ప్రచారం ఉంది. అసిస్టెంట్‌ కమిషనర్‌ స్థాయి అధికారి చేపట్టిన శాఖాపరమైన అంతర్గత విచారణ ఫలితాల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా ఎక్సైజ్‌ యూనిట్లలో అంతర్గత విచారణ చేయాలని భావిస్తున్నారు.

ఇదీ చూడండి..

ప్రభుత్వ వైఫల్యాలపై కేసీఆర్​కు కోదండరాం బహిరంగ లేఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.