ETV Bharat / state

రాష్ట్రంలో పలువురు ఐపీఎస్‌ అధికారులు బదిలీ - హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి - rachakonda cp sudher babu

IPS Officers Transfers in Telangana Today : తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లకు కొత్త పోలీస్ బాసులు వచ్చారు. మరోవైపు ప్రస్తుతం హైదరాబాద్ సీపీగా ఉన్న సందీప్ శాండిల్యను నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్​గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

IPS Officers Transfers
IPS Officers Transfers in Telangana Today
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 12, 2023, 12:52 PM IST

Updated : Dec 12, 2023, 6:06 PM IST

IPS Officers Transfers in Telangana Today : హైదరాబాద్​ పోలీస్​ కమిషనర్(Hyderabad CP)​గా కొత్తకోట శ్రీనివాస్​ రెడ్డి బదిలీ అయ్యారు. ప్రస్తుతం డీజీపీ కార్యాలయంలో ఆర్గనైజేషన్​, లీగల్​ విభాగం అదనపు డీజీగా విధులు నిర్వహిస్తున్నారు. దాదాపు పదేళ్లుగా అప్రాధాన్య పోస్టులో ఉన్న కొత్తకోట శ్రీనివాస్​ రెడ్డికి కీలకమైన హైదరాబాద్​ సీపీ పోస్టు దక్కింది. ముక్కుసూటిగా, నిజాయతీగా వ్యవహరిస్తారనే పేరున్న శ్రీనివాస్​ రెడ్డి(Hyderabad CP Srinivas Reddy), ఎక్కువ కాలం ఏ పోస్టులోనూ పని చేయలేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్​ ప్రభుత్వంలో కీలకమైన స్థానానికి బదిలీ అయ్యారు.

IPS Officers Transfers in Telangana Today
ఐపీఎస్​ల బదిలీ వివరాలు

ప్రస్తుత హైదరాబాద్​ సీపీసందీప్​ శాండిల్లను టీఎస్​ న్యాబ్​ డైరెక్టర్​గా బదిలీ చేశారు. సైబరాబాద్​ సీపీగా అవినాశ్​ మహంతి బదిలీ అయ్యారు. ఆ స్థానంలో ఉన్న స్టీఫెన్​ రవీంద్రను డీజీపీ కార్యాలయానికి బదిలీ చేశారు. రాచకొండ సీపీగా సుధీర్​ బాబు బదిలీ అయ్యారు. ప్రస్తుతం సుధీర్​ బాబు హైదరాబాద్​ ట్రాఫిక్​ విభాగం అదనపు సీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాచకొండ సీపీగా ఉన్న డీఎస్​ చౌహాన్​ను డీజీపీ కార్యాలయానికి బదిలీపై పంపించారు.

EC Transfers Several Collectors and SPs in Telangana : హైదరాబాద్ సీపీ సహా పలువురు కలెక్టర్లు, ఎస్పీల బదిలీకి ఈసీ ఆదేశం

గతంలో హైదరాబాద్​ సీపీగా ఉన్న ఆనంద్​ను బదిలీ చేసిన ఈసీ : డిసెంబరు 3వ తేదీన తెలంగాణ శాసనసభ ఎన్నికల దృష్ట్యా కొందరు జిల్లా కలెక్టర్లను, పోలీస్​ కమిషనర్లు, ఎస్పీలను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఈ క్రమంలో హైదరాబాద్​ సీపీగా ఉన్న సీపీ ఆనంద్​ను సైతం గత ఫిర్యాదుల ఆధారంగా వేరే చోటుకు బదిలీ చేశారు. డబ్బు, మద్యం, ఇతరత్రా పంపిణీ, మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ బదిలీలను కేంద్ర ఎన్నికల సంఘం చేసింది.

గత ప్రభుత్వంలో హైదరాబాద్​ సీపీగా పని చేసిన ఆనంద్​, ప్రస్తుతం బదిలీలో ఉన్నారు. ప్రస్తుత ప్రభుత్వం హైదరాబాద్​ సీపీగా కొత్తకోట శ్రీనివాస్​ రెడ్డిని నియమించింది. మళ్లీ హైదరాబాద్​ సీపీగా ఆనంద్​ వస్తారనే అంచనాలకు ఫుల్​ స్టాప్​ పడింది. అలాగే కౌంటింగ్​ రోజు రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్​ను కూడా ఈసీ సస్పెండ్​ చేసింది. ఇప్పుడు మళ్లీ ఆ సస్పెండ్​ను రద్దు చేసింది.

టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ పదవికి జనార్దన్‌రెడ్డి రాజీనామా - ఆమోదించని గవర్నర్

హైదరాబాద్​లో ట్రాఫిక్ భూతం - అధికారులు చలానాలకే పరిమితం - వాహనదారులకు తప్పని నరకం

Last Updated : Dec 12, 2023, 6:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.