ETV Bharat / state

మరో అంతర్జాతీయ సదస్సు నుంచి మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం - అమెరికాలో సదస్సుకు మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం

Invitation to KTR from International Conference: ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​ను ప్రపంచ పర్యావరణ నీటి వనరుల సదస్సుకు హాజరు కావాలని అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ సివిల్ ఇంజినీర్స్‌-ఎన్వైర్మెంటల్‌ అండ్‌ వాటర్‌ రిసోర్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆహ్వానించింది. మే 21 నుంచి 25 వరకు అమెరికాలోని హెండర్‌సన్‌ నేవడాలో ఆ సదస్సు జరగనుంది.

KTR
KTR
author img

By

Published : Jan 29, 2023, 10:38 PM IST

Invitation to KTR from International Conference: ప్రపంచ పర్యావరణ నీటి వనరుల సదస్సుకు హాజరు కావాలని అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ సివిల్ ఇంజినీర్స్‌-ఎన్విరాన్​మెంటల్‌ అండ్‌ వాటర్‌ రిసోర్స్‌ ఇన్‌స్టిట్యూట్‌.. మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించింది. ఇటీవల సంస్థకు సంబంధించిన పలు బృందాలు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన విధానం, సౌకర్యాలు, వేగంగా నిర్మాణం పూర్తి చేసిన విధానం సంస్థ బృందాన్ని ఆకట్టున్నాయి.

దీంతో ఆ సంస్థ ఎండీ బ్రెయిన్‌ పార్సన్స్‌ మంత్రి కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మే 21 నుంచి 25 వరకు అమెరికాలోని హెండర్సన్‌ నెవడాలో జరగనున్న సదస్సులో ప్రసంగించాలని మంత్రి కేటీఆర్‌ను కోరారు. 2017 మే లో కాలిఫోర్నియాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటిఆర్‌.. తెలంగాణ చేపట్టిన పలు కార్యక్రమాల గురించి ప్రసంగించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.