ETV Bharat / state

సీఎం కేసీఆర్​కు ఆహ్వానం పంపిన ఎంకే స్టాలిన్​.. అందుకోసమేనటా..!​ - FIDE International Chess Olympiad

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్​ సీఎం కేసీఆర్​కు ఆహ్వానం పంపారు. ఈ నెల 28 నుంచి చెన్నైలో జరగనున్న 44వ ఫిడే అంతర్జాతీయ చెస్ ఒలంపియాడ్ పోటీలకు రావాల్సిందిగా కోరారు. ఈ మేరకు డీఎంకే రాజ్యసభ సభ్యుడు గిరిజానన్ కేసీఆర్​కు ఆహ్వాన పత్రిక అందించారు.

ఫిడే అంతర్జాతీయ చెస్ ఒలంపియాడ్ పోటీలకు సీఎం కేసీఆర్​కు ఆహ్వానం​

author img

By

Published : Jul 22, 2022, 10:43 PM IST

INVITATION TO CM KCR: తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో జరగనున్న 44వ ఫిడే అంతర్జాతీయ చెస్ ఒలంపియాడ్ పోటీలకు ముఖ్యమంత్రి కేసీఆర్​ను ఆ రాష్ట్ర సీఎం ఎం.కె.స్టాలిన్ ఆహ్వానించారు. ఈ మేరకు డీఎంకే రాజ్యసభ సభ్యుడు గిరిజానన్ ద్వారా ఆహ్వాన లేఖను పంపారు. హైదరాబాద్ ప్రగతిభవన్​లో కేసీఆర్​ను కలిసిన గిరిజానన్.. ఆహ్వాన పత్రిక అందించారు.

ఈ నెల 28 నుంచి వచ్చే నెల 10 వరకు చెన్నైలో పోటీలు జరగనున్నాయి. 188 దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటున్న ఈ ప్రతిష్ఠాత్మక పోటీలు భారతదేశంలో మొదటిసారి, ఆసియా ఖండంలో మూడోసారి జరుగుతున్నాయి.

ఇవీ చూడండి..

మళ్లీ అందుకున్న వానలు.. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశం..

రిటైర్మెంట్ ప్రకటించిన రాజకీయ దిగ్గజం.. ఇక కుమారుడి ఇన్నింగ్స్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.