ETV Bharat / state

నాపై చేసినవన్నీ నిరాధార ఆరోపణలే: ఏబీ వెంకటేశ్వరరావు - ఏపీ వార్తలు

సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు విచారణ ముగిసింది. సచివాలయంలో కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ ముందు విచారణ జరిగింది. తన వాదనకు అవకాశం ఇచ్చిన సుప్రీంకోర్టుకు రుణపడి ఉంటానని ఏబీ వెంకటేశ్వరరావు ఈ సందర్భంగా చెప్పారు.

ab venkateshwara rao
ఏబీ వెంకటేశ్వరరావు
author img

By

Published : Apr 4, 2021, 9:07 PM IST

"వైఎస్ వివేకా మరణం ప్రమాదవశాత్తూ జరిగిందనడం ఎంత నిజమో.. నాపై ఆరోపణలు కూడా అంతే నిజం" అని సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. తనపై రాష్ట్ర ప్రభుత్వం చేసినవన్నీ నిరాధార ఆరోపణలని, వాస్తవాలన్నింటినీ కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ ముందు హాజరై వివరించినట్లు చెప్పారు. కృత్రిమ ధృవపత్రాలు సృష్టించి తనను ఇరికించారని.. ఈ వ్యవహారాలన్నింటిపై విచారణ పూర్తైన అనంతరం తాను నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.

సుదీర్ఘంగా విచారణ

కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ ముందు ఏబీ వెంకటేశ్వరరావు తుది విచారణకు హాజరయ్యారు. సచివాలయంలోని 5వ బ్లాక్​లో సుదీర్ఘంగా కొనసాగిన విచారణలో పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులనూ కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ ప్రశ్నించింది. 14 రోజులుగా కొనసాగుతున్న విచారణ పూర్తయిందని, తాను సాక్ష్యాన్ని కూడా ఇచ్చానని, కమిషనర్ వాస్తవాలను పరిశీలించి నిర్ణయం చెబుతారన్నారు.

తన వాదనను మొత్తం కమిషనర్ చాలా సావధానంగా విన్నారని ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు. సాక్షులను తానే క్రాస్ ఎగ్జామినేషన్ చేసినట్లు తెలిపిన ఆయన.. కొంతమంది సంతృప్తిగా సమాధానం చెప్పారని..కొందరు వారికి నచ్చినట్టు చెప్పారన్నారు. వివరాలు వాస్తవాలు అన్ని రికార్డ్ అయ్యాయని త్వరలోనే కమిషనర్ తన నిర్ణయం చెప్తారన్నారు. అవసరం అయితే ప్రభుత్వానికి లేఖ రాస్తానన్నారు.

ఇదీ చదవండి: పత్తి రైతులపై రూ.కోట్ల భారం..పెరగనున్న విత్తన ధరలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.