ETV Bharat / state

interview with Civils Coaching Experts: 'సివిల్స్​కి ప్రిపేరయ్యే వారు ఈ అంశాలను కచ్చితంగా పాటించాలి'

సివిల్ సర్వీసెస్​లో విజయం సాధించడం... ఎంతో మంది యువత కల. ఆ స్వప్నాన్ని నిజం చేసుకునే ప్రయత్నంలో భాగంగా ప్రిలిమ్స్​లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు.. జనవరి 7 నుంచి జరగనున్న మెయిన్స్​కు సన్నద్ధమవుతున్నారు. తొలి అడుగులో విజయం సాధించి.. మరో కీలక అడుగు వేసేందుకు సిద్ధమవుతున్నారు. మెయిన్స్ పరీక్ష ఎలా ఉంటుంది.. ఏ పేపర్ ఎలా ప్రిపేర్ కావాలనే అంశాలను సివిల్స్ కోచింగ్ నిపుణులు, లా ఎక్సలెన్స్ ఐఏఎస్ డైరెక్టర్ డాక్టర్ రాంబాబు ఈటీవీ భారత్ ముఖాముఖిలో వివరించారు (interview with Civils Coaching Experts).

interview with Civils Coaching Experts
interview with Civils Coaching Experts
author img

By

Published : Nov 7, 2021, 11:40 AM IST

సివిల్​ సర్వీసెస్ ప్రిలిమ్స్​లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు.. జనవరి 7 నుంచి జరగనున్న మెయిన్స్​కు సన్నద్ధమవుతున్నారు. మెయిన్స్ పరీక్ష ఎలా ఉంటుంది.. ఏ పేపర్ ఎలా ప్రిపేర్ కావాలనే అంశాలను సివిల్స్ కోచింగ్ నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు (interview with Civils Coaching Experts).

interview with Civils Coaching Experts
లా ఎక్సలెన్స్ ఐఏఎస్ డైరెక్టర్ డాక్టర్ రాంబాబు

సమయం తక్కువగా ఉంది.. ప్రణాళిక చాలా ముఖ్యం

మెయిన్స్ పరీక్షకు సమయం చాలా తక్కువగా ఉంది. వచ్చే ఏడాది జనవరిలో మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి (civils mains preparation). రెండు నెలల సమయమే ఉన్నందున ప్రణాళికాబద్ధంగా సన్నద్ధం కావాలి. సబ్జెక్టులను రెండు భాగాలుగా విభజించుకోవాలి. విశ్లేషణాత్మకంగా సమాధానాలు రాయాల్సిన ఎస్సే, ఎథిక్స్, ఆప్షనల్స్ ఒక భాగం. వేగంగా రాయాల్సిన జనరల్ స్టడీస్ పేపర్లు రెండో భాగం. సమయం తక్కువగా ఉంది కాబట్టి ఎక్కువ స్కోరు వచ్చే అంశాలపై దృష్టి పెట్టాలి. ఎస్సే, ఎథిక్స్​ల్లో స్కోరు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలా మంది విద్యార్థులు చేసే పొరపాటు ఏమిటంటే... ఎక్కువగా కరెంట్ అఫైర్స్ దృష్టి పెడతారు. కరెంట్ ఎఫైర్స్ ముఖ్యమే కానీ.. తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు సాధించడం అందులో సాధ్యం కాదు. జనరల్ స్టడీస్, ఎస్సే, ఎథిక్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. పరీక్షలో టైం మేనేజ్ మెంట్ చేయలేక విద్యార్థులు నష్టపోతున్నారు. కాబట్టి జనరల్ స్టడీస్​లో మూడు నుంచి నాలుగు పరీక్షలు ప్రాక్టీస్ చేయాలి.

అర్హత పేపర్లు కష్టమేమీ కాదు.. కానీ కసరత్తు అవసరమే

సివిల్ సర్వీసెస్ రాసే వారికి ఇంగ్లీష్ ఇబ్బందిగా ఉండదు. తెలుగు, హిందీ, ఉర్దూ వంటి మాతృభాషలో రాసే వారు పరీక్షకు కనీసం వారం ముందు ప్రాక్టీస్ చేయాలి. తెలుగు మాధ్యమంలో చదవని అభ్యర్థులు "ఈనాడు" ఎడిటోరియల్స్ చదవాలి.

'సివిల్స్​కి ప్రిపేరయ్యే వారు ఈ అంశాలను కచ్చితంగా పాటించాలి'

జనరల్ స్టడీస్ పేపర్లకు సాధన ముఖ్యం

జనరల్ సైన్స్ పేపర్లు సాధన చేయాలి. పాలిటీ, ఎకానమీపై కనీస అవగాహన ప్రిలిమ్స్ ప్రిపరేషన్ సమయంలోనే వచ్చి ఉంటుంది. వాటిని సమాధానాలుగా రాసి మార్కులుగా మలుచుకునే అంశంపై ఇప్పుడు ఎక్కువగా దృష్టి పెట్టాలి. ఆర్ట్స్, కల్చర్, ప్రాచీన చరిత్ర టాపిక్స్​లో తక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి అలాంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత, ఎక్కువ సమయం ఇవ్వకపోవడం మంచిది. గత ప్రశ్నపత్రాలను పరిశీలించి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన వాటిపై ఫోకస్ చేయాలి. ఎథిక్స్ వంటి పేపర్లను ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా సమాధానాలు రాయగలుగుతారు. ఎథిక్స్ లో గతేడాది చాలా మంది విద్యార్థులు అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయలేకపోయారు. ఈ సారి అలాంటి తప్పులు జరగకుండా చూడండి.

వ్యాసం.. రాసే విధానం కీలకం

ఎస్సే రాయడంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎస్సే కథనాత్మకంగా రాయాలి. విషయం వివరించే విధానం (నేరేషన్) చాలా ముఖ్యం. ఎస్సేలో ప్రశ్నల తీరు మారిపోయింది. గతంలో పొలిటికల్, సోషల్ అంశాలపై ఎక్కువగా ఇచ్చేవారు. ఇప్పుడు గాంధేయ వాదం, ఫిలాసఫీ అంశాలపై ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నాయి. గాంధీజీ సిద్ధాంతాలపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రశ్నలు ఇస్తున్నారు. తత్వం, విలువకు సంబంధించిన అంశాలపై కూడా దృష్టి పెట్టాలి. కనీసం అయిదారు వ్యాసాలు ప్రాక్టీసు చేయాలి. పేరాల మధ్య కనెక్టివిటీ ఉండాలి. వ్యాసంలో చెప్పదలుచుకున్న ప్రధాన అంశం మిస్ కాకుండా జాగ్రత్త పడాలి. ప్రధాన అంశం ఒక్కో చోట ఒక్కో విధంగా ఉంటే మార్కులు తగ్గుతాయి. వ్యాసంలో ఆద్యంతం ఒకే వివరణ ఇస్తున్నారా.. ఆలోచన విధానంలో స్పష్టత ఉందా అనే విషయాన్ని చూస్తారు. అందుకే వ్యాసాన్ని రాసి చూసుకోవాలి.

పాయింట్లుగా రాయాలా.. వివరంగా రాయాలా..?

వ్యాసం రాసే విధానం ఎలా ఉండాలనేది కూడా కీలకం. రెండు రకాలుగా విభజించవచ్చు. జనరల్ సైన్స్ లో విషయ పరిజ్ఞానం ఎక్కువగా చూస్తున్నారు. కాబట్టి తక్కువ సమయంలో ఎక్కువ విషయం చెప్పగలగాలి. జనరల్ స్టడీస్​లో ఒక ప్రశ్నకు సమాధానం రాయడానికి ఆరు నుంచి ఏడు నిమిషాల సమయం పడుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి పాయింట్ల రూపంలో రాస్తే.. తక్కువ సమయంలో ఎక్కువ వివరంగా ఉంటుంది. సివిల్స్ 2020లో మొదటి ర్యాంకు సాధించిన శుభం కుమార్ తాను వ్యాసాలు రాసిన విధానాన్ని ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ప్రతీ దానికి ఓ పాయింట్ రాయడం.. దానికి బలం చేకూర్చేలా ఒక ఉదాహరణ లేదా గణాంకాలు రాసినట్లు పేర్కొన్నారు. అలా ఒక్కో వ్యాసాన్ని పది నుంచి 12 పాయింట్లతో రాశారు. ఇక రెండో భాగం ఆప్షనల్స్, ఎథిక్స్, ఆప్షనల్స్, ఎథిక్స్​లో సమాధానాలు విశ్లేషణాత్మకంగా రాయాలి. పాయింట్ల రూపంలో రాస్తే ఉపయోగం ఉండదు.

ఫలితాన్ని శాసిస్తున్న ఆప్షనల్స్..

ఆప్షనల్స్ ఫలితాన్ని నిర్ణయించేదిగా ఉంటున్నాయి. ఆప్షనల్స్ రెండు విధాలుగా విభజించవచ్చు. హ్యుమానిటీస్, సైన్స్ సంబంధిత ఆప్షనల్స్. గణితం, ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి సైన్స్ సబ్జెక్టులు లెంతీగా ఉంటాయి. 400 మార్కులకు రాస్తే 280 నుంచి 300 మార్కులు రావొచ్చు. సైన్స్ ఆప్షన్లలో ఎక్కువగా రాయడం కన్నా.. రాసిన వాటిలో పర్​ఫెక్షన్ ఉండేలా చూడటం మంచిది. హ్యుమానిటీస్​లో ప్రశ్నలన్నీ రాయడం ముఖ్యం. అయితే సమాధానం రాయడం వేరు. సమాధాన పరచడం వేరు. ప్రశ్న క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకొని ఎగ్జామినర్ అంచనాలకు అనుగుణంగా రాయాలి. ప్రశ్నకు రిలవెంట్​గా సమాధానం రాయాలి. పాత ప్రశ్నపత్రాలు ఒకటికి రెండు సార్లు చూడాలి. ప్రశ్నరూపం మారుతుంది, కానీ సమాధానం అదే ఉంటుంది.

ట్రిపుల్ ఆర్ ముఖ్యం..

రివైజ్, రీకలెక్షన్, రిప్రజెంటేషన్ చాలా ముఖ్యం. ఈ మూడు అంశాలను సమర్థంగా చేయగలిగితే మార్కులు వస్తాయి. చదివిన అంశాలను పునశ్చరణ చేయుకోవాలి. పరీక్ష సమయంలో చదివిన విషయాన్ని 30 సెకన్లలో గుర్తు తెచ్చుకోగలగాలి. హెడ్డింగు, సబ్ హెడ్డింగ్, సైడ్ హెడింగ్ ఇలా చక్కగా ఆర్గనైజ్ చేసి రిప్రెజంట్ చేయాలి. తక్కువ సమయంలో ఎగ్జామినర్​ను ఆకట్టుకోగలగాలి.

పట్టున్న అంశాలను మరింత మెరుగుపరుచుకోవాలి

సివిల్ సర్వీసెస్ అంటే ఒత్తిడితో కూడిన పరీక్ష. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ.. ఇలా ప్రతీ దశలోనూ ఒత్తిడి ఉంటుంది. తక్కువ సమయం ఉందని ఒత్తిడికి లోను కావద్దు. పరీక్ష రాసే అందరికీ రెండు నెలల సమయమే ఉంది. క్రికెట్ ఆడేటప్పుడు తమకు అనుకూలమైన వైపు బాల్ వచ్చినప్పుడు సిక్స్ కొట్టగలుగుతాం. వీక్ సైడ్ బాల్ వస్తే డిఫెన్స్ ఆడతాం. ఇక్కడా అదే టెక్నిక్ వర్తిస్తుంది. మెయిన్స్​కు సన్నద్ధమయ్యే సమయంలో తమ బలహీనతలపై ఎక్కువగా దృష్టి పెట్టవద్దు. తమ అనుకూల అంశాలను, బలాలనే మరింత మెరుగుపరుచుకోవాలి. అప్పుడు బలహీనంగా ఉన్న అంశాల్లో పదికి మూడు మార్కులు వచ్చినా.. పట్టు ఉన్న అంశాల్లో పదికి ఆరు మార్కులు వస్తే బ్యాలెన్స్ అవుతాయి. వార్తల్లో ఎక్కువగా ప్రాధాన్యత ఉన్న అంశాలపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని ఎక్కువగా విశ్లేషించాలి. ఈ ఏడాది వ్యవసాయ చట్టాలపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

ప్రిలిమ్స్ ఫెయిలైన వారు ముందుగా మెయిన్స్​కు ప్రిపేర్ కావాలి

ఇటీవల ప్రిలిమ్స్ ఫలితాల్లో... మెయిన్స్​కు అర్హత సాధించని వారు నిరాశపడవద్దు. వచ్చే ఏడాది జూన్ 5న మళ్లీ ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. ఏడెనిమిది నెలల సమయం ఉంది. ముందుగా రానున్న రెండు, మూడు నెలలు మెయిన్స్ పై దృష్టి పెట్టడం మంచిది. ఆ తర్వాత నాలుగైదు నెలలు ప్రిలిమ్స్ ప్రిపేర్ కావచ్చు. ముందుగా ప్రిలిమ్స్​పై దృష్టి సారిస్తే... తర్వాత రెండు, మూడు నెలల్లో మెయిన్స్ ప్రిపరేషన్​కు సమయం సరిపోదు. ప్రిలిమ్స్​లో విజయం సాధించానన్న భావన, ఆత్మవిశ్వాసంతో మెయిన్స్​కు ప్రిపేర్ కావాలి. మెయిన్స్​కు అర్హత సాధించలేక పోయామని నిరాశ పడొద్దు. లోపాలను గుర్తించి సరిచేసుకుంటే సరిపోతుంది. బలహీన అంశాలను మెరుగుపరచుకునేందుకు కష్టపడాలి.

ఇదీ చూడండి: 'నా విజయం బిహార్​ యువకులకు ప్రేరణ లాంటిది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.