ETV Bharat / state

'ఆరోజు నగరంలోని పలుచోట్ల తాగునీటి సరఫరాకు అంతరాయం' - no drinking water supply in Hyderabad news

హైదరాబాద్​లోని పలుచోట్ల ఏప్రిల్​ 1న తాగునీటి స‌ర‌ఫ‌రాలో పాక్షిక అంత‌రాయం ఏర్పడనున్నట్లు జలమండలి ప్రకటించింది. పైపులైన్​ విస్తరణ పనుల నేపథ్యంలో తాగునీటికి అంతరాయం కలగనున్నట్లు వెల్లడించింది.

Interruption of drinking water
తాగునీటి సరఫరాకు అంతరాయం
author img

By

Published : Mar 29, 2021, 4:36 PM IST

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలుచోట్ల మంచినీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం కలగనున్నట్లు జలమండలి వెల్లడించింది. మహానగరానికి మంచినీటి సరఫరా చేస్తున్న కృష్ణా ఫేజ్​-1 చాంద్రాయ‌ణగుట్ట నుంచి కందిక‌ల్ గేట్ క్రాస్​రోడ్డు వ‌ర‌కు పైపులైన్ విస్తర‌ణ ప‌నులు చేప‌డుతుండటమే ఇందుకు కారణమని పేర్కొంది. ఈ మేరకు ఏప్రిల్ 1 ఉదయం 6 గంటల నుంచి 2వ తేదీ ఉదయం 6 గంటల వరకు నీటి సరఫరాను నిలిపివేయనున్నట్లు స్పష్టం చేసింది.

అంతరాయం ఎక్కడెక్కడంటే..

ఓ అండ్ ఎమ్ డివిజ‌న్ నెంబర్​ 1 ప‌రిధిలో..

  • మిరాలం రిజ‌ర్వాయ‌ర్
  • కిష‌న్​బాగ్ ప్రాంతం

ఓ అండ్ ఎమ్ డివిజ‌న్ నెంబర్​ 2 ప‌రిధిలో..

  • ఆల్​ జుబైల్​ కాలనీ
  • అలియాబాద్ రిజ‌ర్వాయ‌ర్ ప్రాంతం
  • బాలాపూర్ రిజ‌ర్వాయ‌ర్ ప్రాంతం

అంత‌రాయం నేపథ్యంలో వినియోగ‌దారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని జలమండలి అధికారులు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: రాగల రెండు మూడు రోజుల్లో పొడి వాతావరణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.