ఇదీ చదవండి : వినియోగదారుల అభిరుచికే ప్రాధాన్యం.. అదే "విభా" విజయసూత్రం
Sakinala Savitramma:'అప్పుడు అంతా నవ్వుకున్నారు.. ఇప్పుడు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు' - ఇదీ సంగతి
మనకెందుకీ వ్యాపారం అంటూ అందరూ వద్దన్నా... వ్యాపారం చేపట్టాలన్న తపన ఆమెను ముందుకు నడిపింది. 1998లోనే శ్రీదేవి స్వగృహ ఫుడ్స్ పేరుతో వ్యాపారాన్ని ప్రారంభించి నేడు వంద మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నారు సావిత్రమ్మ. హైదరాబాద్‌లో నాలుగు చోట్ల ఔట్ లెట్లను నిర్వహిస్తూ....రుచికరమైన పిండివంటలను వినియోగదారులకు అందిస్తున్నారు. సకినాల సావిత్రమ్మగా పేరు తెచ్చుకున్నారు. తెలంగాణ ప్రత్యేకమైన వివిధ రకాల పిండి వంటకాలను ప్రజలకు చేరువ చేస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని 75 ఏళ్ల వయసులోనూ దిగ్విజయంగా వ్యాపారాన్ని సాగిస్తూ..ఆదర్శంగా నిలుస్తున్న సావిత్రమ్మ.. తన మనోగతాన్ని ఈటీవీ భారత్తో పంచుకున్నారు.
సకినాల సావిత్రమ్మతో ప్రత్యేక ముఖాముఖి