అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని సేవ్ ఇండియా ఫ్యామిలీ స్వచ్ఛంద సంస్థ హైదరాబాద్లో ఘనంగా నిర్వహించింది. ఎన్టీఆర్ పార్క్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో... సమాజంలో పురుషులకు జరుగుతున్న అన్యాయాలు, హక్కులపై సంతకాల సేకరణ చేపట్టారు. పురుషులతో పాటు మహిళలు, చిన్నారులు సంతకాలు చేసి మద్దతు తెలుపుతూ... పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని నవంబర్ 19 న జరుపుకుంటారని... అందులో భాగంగా ఈ రోజు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
పురుషుల మానసిక ఆరోగ్యం, ఆత్మహత్యల నివారణలతోపాటు... వారి జీవితాలను మెరుగుపరచడానికి తమ సంస్థ పనిచేస్తుందని వారు స్పష్టం చేశారు.
ఇవీచూడండి: సాయం చేయండి.. పసివాడికి ప్రాణం పోయండి