బ్యూటీకి సంబంధించి అంతర్జాతీయ బ్రాండ్ డైసన్ హైదరాబాద్ ఫ్యాషన్ ప్రియులకు అందుబాటులోకి రావడం ఆనందంగా ఉందని మిర్రర్ సెలూన్ ఫౌండర్ విజయలక్ష్మి అన్నారు. ప్రముఖ బ్యూటీ సెంటర్ మిర్రర్ సెలూన్ అండ్ బ్యూటీ.. డైసన్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని మిర్రర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డైసన్ దక్షిణ జనరల్ మేనేజర్ జయదాస్, సినీ నటి సంజన, ప్రముఖ డిజైనర్ శిల్పారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతి బ్రాండ్ ఇప్పుడు మిర్రర్‌లో అందిస్తున్నందుకు సంతోషంగా ఉందని విజయలక్ష్మి హర్షం వ్యక్తం చేశారు. భాగ్యనగరం ఫ్యాషన్‌కు కేంద్రంగా మారుతోందని సంజన చెప్పారు.
ఇదీ చూడండి :లాక్మే ఫ్యాషన్ వీక్‌లో అందాల తారల హొయలు