ఏపీ కృష్ణా జిల్లా గన్నవరం వైకాపాలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. ఇందుకు ఇళ్ల పట్టాల పంపిణీపై వేదికైంది. ఎమ్మెల్యే వంశీమోహన్, యార్లగడ్డ వర్గీయుల మధ్య తోపులాటతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే వంశీ సమక్షంలోనే ఈ ఘటన జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు వివాదాన్ని చక్కదిద్దే యత్నం చేశారు. ఇరువర్గాలను చెదరగొట్టారు.
ఇదీ చదవండి