Intermediate results: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో కేవలం 49 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల 59 వేల 242 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. అందులో జనరల్ విద్యార్థులు 4 లక్షల 9 వేల 911 కాగా... ఒకేషనల్ విద్యార్థులు 49 వేల 331 మంది ఉన్నారు. గత కొన్నేళ్లుగా ఎన్నడూ లేనివిధంగా కేవలం 49శాతం విద్యార్థులే ఉత్తీర్ణలయ్యారు. బాలికలు 56 శాతం పాస్ కాగా.. బాలురలో 42 శాతమే ఉత్తీర్ణులయ్యారు. అత్యధికంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 63 శాతం... అతితక్కువగా మెదక్ జిల్లాలో 22శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఎంపీసీలో 61 శాతం, బైపీసీలో 55 శాతం, హ్యుమానిటీస్ గ్రూపుల్లో 50శాతం నమోదయింది. ఒకేషనల్‌లో ఇంజినీరింగ్ కోర్సుల్లో కేవలం 39శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఎంపీసీలో అత్యధిక మార్కులు 470కి 467 కాగా.. బైపీసీలో 440కి 438, ఎంఈసీలో 500కు 494, సీఈసీలో 500కి 492, హెచ్ఈసీలో 500కి 488 మార్కులు సాధించారు.
ఫలితాలపై కొవిడ్ ప్రభావం
covid effect on inter results కరోనా వేళ తడబడిన తరగతుల బోధన.. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాలపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.. మంచిర్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, భూపాలపల్లి, మెదక్, యాదాద్రి, సూర్యాపేట, సూర్యాపేట, గద్వాల, నాగర్ కర్నూలు, వికారాబాద్, నారాయణపేట జిల్లాల్లో ఉత్తీర్ణత 40శాతం కూడా చేరలేదు. కరోనా తీవ్రత కారణంగా మార్చిలో పరీక్షలు నిర్వహించ లేకపోయిన ఇంటర్ బోర్డు... అక్టోబరులో పరీక్షలు జరిపింది. కరోనా పరిస్థితుల వల్ల బోధన సరిగా జరగలేదని... ఓ వైపు రెండో సంవత్సరం చదువుతుండగా.. మొదటి సంవత్సరం పరీక్షలు రాయడం వల్ల విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతుందన్న అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పట్టణ ప్రాంతాల్లో కార్పొరేట్ కళాశాలలు ఆన్లైన్ పాఠాలు నిర్వహించినప్పటికీ... గ్రామీణ, ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు దూరదర్శన్, టీశాట్ పాఠాలపైనే ఆధారపడ్డారు.
ముందస్తు సమాచారం లేకుండా..
inter first year results: కొందరు విద్యార్థుల ఇళ్లల్లో టీవీలు, స్మార్ట్ ఫోన్లు కూడా లేక... ఇబ్బంది పడ్డారు. వీటన్నింటి కారణంగా... తర్జన భర్జనల అనంతరం పరీక్షలు నిర్వహించినప్పటికీ.... తగ్గిన ఉత్తీర్ణత వల్ల ఊగిసలాడిన ఇంటర్ బోర్డు.. చివరకు ఇవాళ ఫలితాలను వెల్లడించింది. ఫలితాల వెల్లడికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విముఖత చూపినట్లు తెలిసింది. సాధారణంగా మీడియా సమావేశంలో ఫలితాలను వెల్లడించే ఇంటర్ బోర్డు.. ఈ ఏడాది ముందస్తు సమాచారం లేకుండా నేరుగా వెబ్సైట్లో అప్ లోడ్ చేసింది. చివరి నిమిషం వరకు ఫలితాల వెల్లడిపై ఇంటర్ బోర్డు స్పష్టత ఇవ్వక పోవడం.. మరోవైపు సోషల్ మీడియాలో రకరకాల ప్రచారంతో.. రెండు, మూడు రోజులుగా విద్యార్థులు ఎదురు చూసి అసహనానికి గురయ్యారు.
రీకౌంటింగ్ కోసం రూ.100.. సమాధానపత్రాల కోసం రూ.600..
intermediate first year results released: రేపు సాయంత్రం 5గంటల నుంచి వెబ్సైట్ల నుంచి మెమోలు డౌన్లోడ్ చేసుకోవచ్చునని ఇంటర్ బోర్డు తెలిపింది. ఫలితాల్లో పొరపాట్లు ఉంటే ఈనెల 31 వరకు ప్రిన్సిపళ్లు తమ దృష్టికి తీసుకురావాలని బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ పేర్కొన్నారు. రీకౌంటింగ్ కోసం 100 రూపాయులు.. సమాధానపత్రాల కోసం 600 రూపాయలు చెల్లించి ఈనెల 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసువచ్చునని ఇంటర్ బోర్డు వెల్లడించింది. tsbie.cgg.gov.in, results.cgg.gov.in, examresults.ts.nic.in వెబ్సైట్లలో ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలను ఉంచినట్లు ఇంటర్‌బోర్డు ప్రకటించింది.
ఇంటర్ ఫలితాల కోసం: క్లిక్ చేయండి.
ఇదీ చదవండి:
Suspense on Inter results: ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలపై విద్యార్థుల్లో ఉత్కంఠ