ఇంటర్ రీవెరిఫికేషన్ ప్రక్రియకు సంబంధించి బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఫలితాలకు సంబంధించిన బాధ్యతను గ్లోబరీనాతో పాటు మరో స్వతంత్ర సంస్థకు అప్పగించనుంది. మరో ఏజెన్సీ ఎంపిక అధికారాన్ని టీఎస్టీఎస్కు అప్పగించినట్లు బోర్డు కార్యదర్శి అశోక్ తెలిపారు. త్రిసభ్య కమిటీ సూచనల మేరకు ఈ మార్పులు చేసినట్లు తెలిపారు. పరీక్షలో ఫెయిలైన సుమారు మూడున్నర లక్షల మంది విద్యార్థులకు సంబంధించి 8 లక్షల జవాబు పత్రాల పునర్మూల్యాంకనం కొనసాగుతోంది. రెండ్రోజుల్లో ఏజెన్సీ ఖరారయ్యే అవకాశం ఉంది.
ఇదీ చదవండి : చిల్లర రాజకీయాలు చేయొద్దు: కేటీఆర్