ETV Bharat / state

సమాధాన పత్రాల పునఃపరిశీలన ప్రక్రియ ప్రారంభం - iter

జవాబు పత్రాల పునఃపరిశీలన ప్రక్రియను ఇంటర్మీడియట్​ బోర్డు ప్రారంభించింది. పదిహేను రోజుల్లో పూర్తి చేయాలని భావిస్తోంది. పాసైన సబ్జెక్టుల రీవెరిఫికేషన్​, రీకౌంటింగ్​ కోసం దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. పునఃపరిశీలన ప్రక్రియ ముగిసిన తర్వాతే ఎంసెట్​ ర్యాంకులు ఖరారు చేయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. గ్లోబరీనా వ్యవహారంపై విచారణ జరిపిన త్రిసభ్య కమిటీ ఇవాళ ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.

సమాధాన పత్రాల పునఃపరిశీలన ప్రక్రియ ప్రారంభం
author img

By

Published : Apr 27, 2019, 5:06 AM IST

Updated : Apr 27, 2019, 7:39 AM IST

విద్యార్థులు,వారి తల్లిదండ్రుల ఆందోళనతో దిగి వచ్చిన ఇంటర్మీడియట్​ బోర్డు... జవాబు పత్రాల రీవెరిఫికేషన్​ ప్రక్రియను చేపట్టింది. ఫెయిలైన సబ్జెక్టులన్నింటికీ ఉచితంగానే పునఃపరిశీలన చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ నిర్ణయించడం వల్ల... ఇంటర్​ బోర్డు యాంత్రంగం యుద్ధప్రాతిపదికన ప్రక్రియను ప్రారంభించింది. సుమారు 8 లక్షల సమాధాన పత్రాలను రీవెరిఫికేషన్​ చేయాల్సి ఉంది. ఫెయిలైన సబ్జెక్టులను పాత జిల్లా కేంద్రాలకు తరలించగా.. ప్రభుత్వ జూనియర్​ కళాశాలల లెక్చరర్లు రీ వెరిఫికేషన్​ ప్రారంభించారు.

సమాధాన పత్రాల పునఃపరిశీలన ప్రక్రియ ప్రారంభం

సప్లిమెంటరీకి దరఖాస్తు చేసుకోండి...

గతంలో మూల్యాంకనం చేసిన కేంద్రాల్లోనే రీ వెరిఫికేషన్​కు హాజరు కావాలని సిబ్బందికి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ దరఖాస్తుకు గడువు నేటితో ముగియనుంది. మొత్తం ప్రక్రియ సుమారు పదిహేను రోజుల్లో పూర్తి చేయాలని బోర్డు భావిస్తోంది. అవసరాన్ని బట్టి ప్రైవేట్ కళాశాలల బోధన సిబ్బందిని కూడా రంగంలోకి దించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రీ వెరిఫికేషన్​లో ఉత్తీర్ణులవుతారో... లేదో తెలియదు కాబట్టి ఫెయిలైన విద్యార్థులందరూ సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్ బోర్డు పేర్కొంది. నేటితో ముగియాల్సిన సప్లిమెంటరీ పరీక్ష దరఖాస్తు గడువును ఈనెల 29 వరకు పొడిగించింది.

విద్యార్థులు ఆందోళన పడొద్దు...

ఇంటర్మీడియట్ మార్కుల్లో తప్పుల ప్రభావం ఎంసెట్​ వెయిటేజీ, ర్యాంకులపై ప్రభావం చూపుతుందని ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు ఆందోళన చెందుతున్నందున... ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. రీవెరిఫికేషన్ ప్రక్రియ పూర్తైన తర్వాతే ర్యాంకులను ప్రకటించనున్నట్లు తెలిపింది. పునఃపరిశీలన తర్వాత మార్కులనే పరిగణనలోకి తీసుకొని ర్యాంకులు ఖరారు చేస్తామని... విద్యార్థులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని మండలి పేర్కొంది. డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాల కోసం మే 6 తర్వాత దోస్త్ నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించినప్పటికీ.. కొన్ని రోజులు వేచి చూడాలని భావిస్తున్నారు. ఒకవేళ నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ... రీవెరిఫికేషన్ ప్రక్రియ పూర్తైన తర్వాతే విద్యార్థులకు డిగ్రీ సీట్లు కేటాయించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఇవాళ నివేదిక సమర్పణ...

గ్లోబరీనా వ్యవహారంపై త్రిసభ్య కమిటీ నివేదికపై ఉత్కంఠ నెలకొంది. మూడు రోజుల పాటు విచారణ జరిపిన నిపుణుల కమిటీ.. ఇప్పటికే నివేదికను సిద్ధం చేయగా.. ఇవాళ విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డికి నివేదిక సమర్పించనున్నారు. ఇంటర్ ఫలితాలు, గ్లోబరీనా వ్యవహారంపై 12 పేజీల ప్రధాన నివేదికతో పాటు... 150 పేజీలతో కూడిన 15 అంశాలను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

కొనసాగుతున్న నిరసనలు...

ప్రభుత్వం, ఇంటర్ బోర్డు అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టినప్పటికీ... నిరసన జ్వాలలు చల్లారడం లేదు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, రాజకీయ పార్టీలు, విద్యార్థి ప్రజా సంఘాలు వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని... బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంటర్ బోర్డునే ఎత్తివేసి.. పాఠశాల విద్యా శాఖలో విలీనం చేయడం మంచిదన్న డిమాండ్ పెరుగుతోంది.

Intro:ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండవ రోజున పత్రాల సమర్పణ మందకొడిగా సాగింది మంగళవారం కావడంతో అభ్యర్థులు నామినేషన్ వేయడానికి ఆసక్తి చూపించలేదు. జిల్లాలో 67 ఎంపీటీసీ స్థానాలకు గాను ఇవాళ 34 నామినేషన్లు దాఖలయ్యాయి. 5 జడ్పిటిసి స్థానాలకు గాను కేవలం 3 నామ పత్రాలు దాఖలయ్యాయి .రేపు చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈనెల 28న ఉపసంహరణ గడువు కాగా అదేరోజు గుర్తులు కేటాయిస్తారు. మే 6 న పోలింగ్ జరగనుంది, మే 27న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

Body:ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండవ రోజున పత్రాల సమర్పణ మందకొడిగా సాగింది మంగళవారం కావడంతో అభ్యర్థులు నామినేషన్ వేయడానికి ఆసక్తి చూపించలేదు. జిల్లాలో 67 ఎంపీటీసీ స్థానాలకు గాను ఇవాళ 34 నామినేషన్లు దాఖలయ్యాయి. 5 జడ్పిటిసి స్థానాలకు గాను కేవలం 3 నామ పత్రాలు దాఖలయ్యాయి .రేపు చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈనెల 28న ఉపసంహరణ గడువు కాగా అదేరోజు గుర్తులు కేటాయిస్తారు. మే 6 న పోలింగ్ జరగనుంది, మే 27న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

Conclusion:ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండవ రోజున పత్రాల సమర్పణ మందకొడిగా సాగింది మంగళవారం కావడంతో అభ్యర్థులు నామినేషన్ వేయడానికి ఆసక్తి చూపించలేదు. జిల్లాలో 67 ఎంపీటీసీ స్థానాలకు గాను ఇవాళ 34 నామినేషన్లు దాఖలయ్యాయి. 5 జడ్పిటిసి స్థానాలకు గాను కేవలం 3 నామ పత్రాలు దాఖలయ్యాయి .రేపు చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈనెల 28న ఉపసంహరణ గడువు కాగా అదేరోజు గుర్తులు కేటాయిస్తారు. మే 6 న పోలింగ్ జరగనుంది, మే 27న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
Last Updated : Apr 27, 2019, 7:39 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.