ETV Bharat / state

జూన్ 3న ఇంటర్ జాగ్రఫీ, మోడ్రన్ లాంగ్వేజెస్ పరీక్ష - education news in telangana

inter geography and modern languages exams on June 3
జూన్ 3న ఇంటర్ జాగ్రఫీ, మోడ్రన్ లాంగ్వేజెస్ పరీక్ష
author img

By

Published : May 31, 2020, 5:30 PM IST

Updated : May 31, 2020, 6:22 PM IST

17:28 May 31

జూన్ 3న ఇంటర్ జాగ్రఫీ, మోడ్రన్ లాంగ్వేజెస్ పరీక్ష

   కరోనా వ్యాప్తి కారణంగా వాయిదా పడ్డ ఇంటర్​ పరీక్షలను పూర్తి చేసేందుకు తెలంగాణ ఇంటర్​ బోర్డు సిద్ధమైంది.  లాక్​డౌన్​ అమల్లోకి రావడం వల్ల మార్చి 23న జరగాల్సిన ఇంటర్​ జాగ్రఫీ, మోడ్రన్​ లాంగ్వేజ్​ పరీక్షలు వాయిదాపడ్డాయి. 

  వాయిదాపడిన పరీక్షలను జూన్ 3న నిర్వహిస్తామని ఇంటర్​ బోర్డు ప్రకటించింది. జూన్ 3న జరగనున్న మోడరన్ లాంగ్వేజ్​, జాగ్రఫీ పరీక్షకు హాజరు కాలేకపోతే, అడ్వాన్స్​డ్ సప్లిమెంటరీ రాయొచ్చని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులను కూడా రెగ్యూలర్ విద్యార్థులు గానే గుర్తిస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి తెలిపారు.

   జూన్ 3 నాటి పరీక్ష కోసం విద్యార్థులు ఇంటర్మీడియట్ బోర్డు వెబ్​సైట్ నుంచి హాట్ టికెట్లు డౌన్​లోడ్ చేసుకోవాలని సూచించారు. ఇంటర్ కాలేజీలు సోమవారం నుంచి పున:ప్రారంభం కావాల్సినప్పటికీ.. కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. జూనియర్ కాలేజీలు ఎప్పుడు ప్రారంభమవుతాయో తర్వాత ప్రకటిస్తామని జలీల్ పేర్కొన్నారు.

ఇదీ చూడండి : ప్రత్యేక రైళ్లలో వేళ్లేవారు ఆ సూచనలు పాటించాలి

Last Updated : May 31, 2020, 6:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.