ETV Bharat / state

అసైన్​మెంట్లు ఇంట్లో రాయండి... మెయిల్ ద్వారా పంపండి: ఇంటర్ బోర్డ్ - Telangana news

పర్యావరణం, విలువల పరీక్షల అసైన్‌మెంట్లు ఇంట్లోనే రాయాలని ఇంటర్ బోర్డు సూచించింది. అసైన్‌మెంట్లు ఏప్రిల్ 1 నుంచి 20 వరకు కాలేజీలో సమర్పించాలని పేర్కొంది.

Inter-Board
ఇంటర్ బోర్డు
author img

By

Published : Mar 30, 2021, 7:27 PM IST

ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు పర్యావరణం, నైతిక, మానవ విలువల పరీక్షల అసైన్​మెంట్లను ఏప్రిల్ 1 నుంచి 20 మధ్య సమర్పించాలని బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి మొదటి సంవత్సరం విద్యార్థులకు హాల్ టికెట్లు జారీ చేయనున్నట్లు ఆయన చెప్పారు. పర్యావరణం, నైతిక-మానవ విలువల పరీక్ష అసైన్ మెంట్ రూపంలో నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది.

ప్రశ్నలకు ఇంట్లోనే సమాధానాలు రాసి నేరుగా లేదా రిజిస్టర్డ్ పోస్టు లేదా మెయిల్ ద్వారా కళాశాలకు సమర్పించాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి పేర్కొన్నారు. అసైన్​మెంట్లపై హాల్​టికెట్ నెంబర్లను తప్పనిసరిగా రాయాలని జలీల్ స్పష్టం చేశారు.

ఇంటర్మీడియట్ బోర్డు వెబ్ సైట్ http://tsbie.cgg.gov.in నుంచి డౌన్​లోడ్ చేసుకోవచ్చునన్నారు. పర్యావరణం, విలువల పరీక్షలను గతంలో ఉత్తీర్ణులు కాని రెండో సంవత్సరం విద్యార్థులు మొదటి సంవత్సరం హాల్ టికెట్ నంబర్​తో అసైన్​మెంట్ రాయాలన్నారు.

ఇదీ చదవండి: రాష్ట్రపతి కోలుకోవాలని కేటీఆర్ ఆకాంక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.